Sania Mirza: Sania Mirza: మహిళల విజయానికి విలువ ఇంతేనా సానియా మీర్జా పోస్ట్‌ వైరల్‌

Sania Mirza: Sania Mirza: మహిళల విజయానికి విలువ ఇంతేనా సానియా మీర్జా పోస్ట్‌ వైరల్‌
మహిళల విజయంపై కంపెనీ యాడ్.. టెన్నిస్ స్టార్ ఆసక్తికర పోస్ట్

మహిళలపై వివక్ష ఇంకా కొనసాగడం విచారకరమని మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా పేర్కొన్నారు. ఓ మహిళ సాధించిన విజయానికి ఎలా విలువ కడుతున్నామని ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ ట్వీట్ చేశారు. తాజాగా ఓ కంపెనీ చేసిన యాడ్ వీడియోను ట్వీట్ చేస్తూ.. స్త్రీ, పురుష వివక్ష చూపొద్దంటూ నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. అర్బన్ క్లాన్ కంపెనీ యాడ్ ను పోస్ట్ చేస్తూ సుదీర్ఘ వ్యాఖ్యానం చేశారు.

సంకుచిత ఆలోచన పేరుతో రూపొందించిన ఈ వీడియోకు సానియా స్పందిస్తూ ఉద్విగ్నభరిత పోస్ట్‌ చేశారు. 2005లో డబ్ల్యూటీఏ టైటిల్‌ గెలిచి.. ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళగా నిలిచానని. అది గొప్పదే కదా..?డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌గా ఉన్నప్పుడు.. తాను ఎప్పుడు స్థిరపడతానా అని ప్రజలు ఆసక్తిగా చూశారు. ఆరు గ్రాండ్‌స్లామ్‌లు గెలవడం ఈ సమాజానికి సరిపోలేదని సానియా అన్నారు. ఓ మహిళ విజయం సాధించినప్పుడు నైపుణ్యాలు, శ్రమకు బదులుగా అసమానతలు, ఆమె ఆహార్యం గురించే ఎందుకు చర్చిస్తారనేది ఇప్పటికీ అర్థం కాదని సానియా భావోద్వేగానికి గురయ్యారు. ఓ మహిళ సాధించిన విజయానికి మనం ఎలాంటి విలువ ఇస్తున్నామనే దానిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని.. కానీ అది ఎప్పటికి జరుగుతుందో చూడాలని సానియా సూచించారు.

సానియా మీర్జా ఈ వీడియో ట్వీట్ చేసి తన స్వంత విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘నా కెరీర్‌లో ఎంతోమంది మద్దతు ఇచ్చారు. కానీ, ఓ మహిళ విజయం సాధించినప్పుడు ఆమె కష్టాన్ని, నైపుణ్యాన్ని చూడాల్సింది పోయి ఆమె ఆహార్యం, అసమానతల గురించి ఎందుకు చర్చిస్తారనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. 2005లో డబ్ల్యూటీఏ టైటిల్‌ గెలిచిన తొలి భారత మహిళగా నిలిచాను. డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌గా ఉన్నప్పుడు.. నేను ఎప్పుడు స్థిరపడతానా అని ప్రజలు ఆసక్తిగా చూశారు. ఆరు గ్రాండ్‌స్లామ్‌లు గెలవడం ఈ సమాజానికి సరిపోలేదు. ఈ యాడ్‌ చూశాక నన్ను ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టాయి. ఓ మహిళ సాధించిన విజయానికి మనం ఎలాంటి విలువ ఇస్తున్నామనే దానిపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. కానీ, అది ఎప్పటికి జరిగేనో..!’’ అని సానియా తన పోస్టులో పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story