Gautam Gambhir : రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన గౌతమ్ గంభీర్,

Gautam Gambhir : రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన గౌతమ్ గంభీర్,
లోక్‌సభ ఎన్నికల ముందు సంచలన నిర్ణయం

క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ లోక్‌సభ ఎన్నికల ముందు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈస్ట్ ఢిల్లీ నుంచి ఎంపీగా ఉన్న ఆయన ట్విటర్ వేదికగా ఈ విషయం వెల్లడించారు. క్రికెట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెడతానని స్పష్టం చేశారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ప్రధాని నరేంద్ర మోదీని ఈ పోస్ట్‌లో ట్యాగ్ చేశారు. ఇన్నేళ్ల పాటు ప్రజలకు సేవలు అందించేందుకు అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

గౌతమ్ గంభీర్ క్రికెట్‌లో ఎంత సక్సెస్ అయ్యారో రాజకీయాల్లో కూడా అంతే విజయం సాధించారు. పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే ఎంపీగా కూడా పూర్తిస్థాయిలో తన సేవలను అందించారు. ఈస్ట్ ఢిల్లీ నుంచి బీజేపీకి పెద్ద అండగా నిలిచారు గౌతమ్ గంభీర్. తన పార్టీకి చాలా సార్లు సపోర్ట్ గా నిలిచారు కూడా. ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కారణం మాత్రం క్రికెట్టే అంటున్నారు గంభీర్. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక గౌతమ్ రాజకీయాల్లో తన సేవలను అందిస్తూనే క్రికెట్ కామెంటేటర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అదే తన ఫైనల్ కెరీర్ ఛాయిన్ చేసుకోవాలని అనుకుంటున్నారు ఈ మాజీ ఓపెనర్. రాజకీయాల్లో తనకు ఇంక ఇంట్రస్ట్ లేదని…కామెంటేటింగ్‌ మీద ఫుల్ ఫోకస్ పెట్టాలనుకుంటున్నాని చెబుతున్నారు గౌతమ్ గంభీర్. రాజకీయాలు, క్రికెట్ రెండింటి మీద దృష్టి పెట్టడం కష్టమని..అందుకే క్రికెట్‌కే ఛాయిస్ ఇస్తున్నాని తెలిపారు. పాలిటిక్స్ విధుల్లో నుంచి తనను తప్పించాలని బీజేపీ సీనియర్ లీడర్ జేపీ నడ్డాకు లేఖ రాశారు గౌతమ్.

ఈ ఏడాది జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో గంభీర్‌కు మరోసారి టికెట్‌ కేటాయించే అవకాశం లేనట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం . కాగా, 2019, మార్చిలో ఆయన బీజేపీలో చేరారు. ఆ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నుంచి పోటీచేసిసి 6,95,109 ఓట్లతో విజయం సాధించారు.

Tags

Read MoreRead Less
Next Story