West Bengal: బంగ్లా-భారత్ సరిహద్దుల్లో స్మగ్లింగ్ బంగారం

West Bengal: బంగ్లా-భారత్ సరిహద్దుల్లో స్మగ్లింగ్ బంగారం
సుమారు 9 కోట్లు విలువ చేసే బంగారం బిస్కెట్ లు

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో భారీగా బంగారం పట్టుబడింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), డైరెక్టర్ ఆఫ్ ఇంటలిజెన్స్ (DRI) జాయింట్ ఆపరేషన్‌లో ఏకంగా 15 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు 9 కోట్ల విలువ చేస్తుందని అధికారులు చెబుతున్నారు.పశ్చిమ బెంగాల్‌లోని నైడా అటవీ ప్రాంతంలో DRI , BSF అధికారులు ఒక జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. దట్టమైన అడవిలో స్మగ్లర్లు బంగారాన్ని దాచారని సమాచారం మేరకు అధికారులు అటవీ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు.


అధికారుల రాకను పసిగట్టిన స్మగ్లర్లు బంగారు బిస్కెట్లను ఓ ఇంటి సమీపంలోని గుంతలో దాచిపెట్టారు. అనుమానం వచ్చిన అధికారులు రెండు టీమ్ లుగా విడిపోయి సోదాలు చేయగా గుంతలో దాచిన బంగారం బయట పడింది. ఈ ఆపరేషన్‌లో, గ్రామానికి చెందిన రవీంద్ర నాథ్ బిస్వాస్ మరియు విధాన్ ఘోష్ అనే ఇద్దరు స్మగ్లర్లను కూడా అరెస్టు చేశారు. మసూద్, నసీఫ్ అనే ఇద్దరు బంగ్లాదేశ్ జాతీయుల నుండి వీరు బంగారు బిస్కెట్లను తీసుకున్నారని, దానిని నదియా డయాట్రియూట్‌లో నివాసం ఉండే సంతోష్ హల్దార్‌కు అప్పగించాల్సి ఉందని సమాచారం. అయితే ఆ ప్రాంతంలో బిఎస్‌ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో, బంగారాన్ని కొంతకాలం ఇంట్లో దాచారు. తరువాత ఎవరికీ అనుమానం రాకూడదని దానిని గుంతల్లో దాచారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.

మరో సంఘటనలో, సరిహద్దు అవుట్‌పోస్ట్ హకీంపూర్‌కు చెందిన సిబ్బంది పెట్రోలింగ్‌ చేస్తుండగా రోడ్డుపై పడి ఉన్న బంగారు బిస్కెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి బరువు 116.580 గ్రాములు కాగా, విలువ ఏడు లక్షల రూపాయలకు పైగా ఉంటుందని బీఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు. బంగారు బిస్కెట్ రికవరీ అనంతరం సరిహద్దుల్లో అమర్చిన రహస్య కెమెరాల సాయంతో స్మగ్లర్ల కోసం పరిశీలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story