Indian Navy: యుద్ధనౌకల ప్రాజెక్ట్ కు కేంద్రం అంగీకారం

Indian Navy: యుద్ధనౌకల ప్రాజెక్ట్ కు కేంద్రం అంగీకారం
5 నౌకలకు రూ. 20 వేల కోట్లు కేటాయింపు

భారత నౌకాదళానికి అవసరమైయ్యే యుద్ధనౌకల తయారీ ప్రాజెక్టకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.20,000 కోట్ల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. భారత నావికాదళానికి ప్రోత్సాహంగా నౌకల్లో ఇంధనం, ఆహారం, మందుగుండు సామగ్రిని నింపడానికి సహాయపడే ఐదు ఫ్లీట్ సపోర్ట్ నౌకలను నిర్మించే ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

గత కొంత కాలంగా భారత ప్రభుత్వం రక్షణ రంగానికి ఎక్కువగా నిధులు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే యుద్ధ విమానాలను కొనుగోలు చేయదానికి సిద్ధం అవ్వగా, ఇప్పుడు తాజాగా యుద్ధ నౌకలను మన దేశంలోనే తయారు చేయాలని నిర్ణయించింది. సుదీర్ఘ శ్రేణి పెట్రోలింగ్‌లో మద్దతు ఇవ్వడానికి ఈ నౌకలు ఇంధనం, మందుగుండు సామగ్రి మరియు ఆహార సామాగ్రి వంటి వివిధ పరికరాలను తీసుకెళ్లగలవు. ఈ ఐదు నౌకలను రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించే నౌకలు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా భారత నౌకాదళ స్వావలంబన లక్ష్యాలను పెంచుతాయ‌ని అధికారులు చెబుటున్నారు.

భారత నావికాదళ పరాక్రమాన్ని బలోపేతం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. సముద్రాలలో మోహరించే నౌకాదళాలకు సరైన సమయంలో ఆహారం, ఇంధనం, మందుగుండు సామగ్రితో సహా అవసరమైన సామాగ్రిని అందించడం ద్వారా వివిధ సేవలు అందిస్తాయి. ఈ ప్రాజెక్టు హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.



పలు చిన్న, మధ్యతరహా పరిశ్రమల భాగస్వాములతో చేయాల్సిన ఈ ఆర్డర్ ను అందుకోవడానికి కంపెనీ కూడా తన సంసిద్ధతను ప్రకటించింది. రానున్న 10 ఏళ్లల్లో ఈ ఐదు నౌకలు సిద్ధమవుతాయని రక్షణ రంగం భావిస్తోంది. సుమారు రూ.20 వేల కోట్ల ప్రాజెక్టుకు బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తుది అనుమతి ఇచ్చింది. ప్రణాళిక ప్రకారం.. హెచ్‌ఎస్‌ఎల్ దాదాపు ఎనిమిదేళ్లలో ఈ మొత్తం అన్ని షిప్‌లను డెలివరీ చేయాలి. వీటిలో ఒక్కో నౌక దాదాపు 45,000 టన్నుల బరువు ఉంటుంది.

ఇది కాకుండా, ప్రభుత్వ సంస్థ గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ యుద్ధ ప్రాతిపదికన తయారు చేసిన అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం భారత నౌకాదళానికి అందజేయనున్నారు. కర్ణాటకలోని 'వింధ్యగిరి' పర్వతం పేరున్న ఈ నౌక ప్రాజెక్ట్ 17A కింద ఉన్న 7 నౌకల్లో ఇది ఆరవది. ప్రాజెక్ట్ యొక్క మొదటి ఐదు నౌకలు 2019 మరియు 2022 మధ్య ప్రారంభించబడ్డాయి.

Tags

Read MoreRead Less
Next Story