No-Confidence Motion: అవిశ్వాసం మాకు శుభప్రదం

No-Confidence Motion: అవిశ్వాసం మాకు శుభప్రదం
ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ కౌంటర్‌.... 2018లోనూ ప్రవేశపెట్టారని గుర్తు చేసిన మోదీ...

పార్లమెంటులో మణిపుర్‌ అంశం(Manipur violence)పై ప్రధాని మోదీ ప్రసంగించేలా చేసేందుకు విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం(No-Confidence Motion) వీగిపోయింది(Government wins no-trust vote). ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగానే విపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేయగా తీర్మానాన్ని మూజువాణి(VOICE VOTE) ఓటుతో సభ తిరస్కరించింది. కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌(Congress leader Gaurav Gogoi ) ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై 3 రోజులుగా 18 గంటలపాటు జరిగిన చర్చలో 58 మంది అధికార, విపక్ష సభ్యులు చేసిన ప్రసంగాలకు ప్రధాని మోదీ సమాధానమిచ్చారు(Prime Minister Narendra Modi replied). మోదీ ప్రసంగం అసాంతం కాంగ్రెస్‌ వైఖరిని విమర్శించడమే లక్ష్యంగా సాగింది. ఈ దేశంలో సమస్యలన్నింటికీ కాంగ్రెస్‌ పాలనే కారణమని మండిపడ్డారు.


కొందరు భారతమాత చావు చూడాలనుకుంటున్నారని, కారణం ఏంటో తెలియడం లేదని మోదీ అన్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం హత్య గురించి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని, వీరే భారత మాతను మూడు ముక్కలు చేశారని పరోక్షంగా కాంగ్రెస్‌ను విమర్శించారు. భరతమాతను బానిసత్వపు సంకెళ్ల నుంచి విముక్తి చేయాల్సిన వీరు భారత మాత భుజాలు నరికేశారుని మోదీ మండిపడ్డారు. ప్రతిపక్షాలు అత్యంత అవినీతిపరులైన సహచరులపై ఆధారపడి... ఈ అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చాయని మోదీ విమర్శించారు. ఈ సందర్భంగా... వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన ప్రధాని అతి త్వరలో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు. ఇందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో చేసిన కృషి, అహర్నిశలు పడిన కష్టమే కారణమని చెప్పారు.


వారసత్వ రాజకీయాల సమాహారమే ప్రతిపక్ష ఇండియా పేరుతో కొత్త సంకీర్ణంగా వచ్చిందని విమర్శించారు. ఎందరో మహానుభావులు వారసత్వ రాజకీయాలు దేశానికి నష్టదాయకమని చెప్పారని అన్నారు. జాతి నిర్మాణంలో వారసత్వ రాజకీయాలు అడ్డంకిగా మారుతాయని తొలి తరం మేధావులు చెప్పిన విషయాన్ని కాంగ్రెస్‌ మర్చిపోయిందని ప్రధాని ఆరోపించారు. వారసత్వ రాజకీయాలు చేసేవాళ్లకు దేశంలో కాలం చెల్లిపోయిందన్న మోదీ కాంగ్రెస్‌ను వ్యతిరేకించిన మేధావులను కూడా ఆ పార్టీ ఓడించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ను ప్రశ్నించినందుకే అంబేడ్కర్‌ను రెండుసార్లు ఎన్నికల్లో ఓడించారని ఎమర్జెన్సీని ప్రశ్నించినందుకు జగ్జీవన్‌రామ్‌ను ఓడించిందన్నారు. మాజీ ప్రధానులందరినీ గౌరవించిన ఘనత NDAదే అని ప్రధాని అన్నారు.


వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి ప్రతిపక్షాలు సిద్ధమయిపోయాయని ప్రధాని మోదీ అన్నారు. అవిశ్వాసం తీర్మానం సందర్భంగా సమాధానం ఇచ్చిన మోదీ విపక్ష కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడాన్ని దేవుడి కృపగా అభివర్ణించిన మోదీ వాళ్లు అలా ప్రవేశపెట్టినప్పుడల్లా తమకు శుభం కలుగుతుందని ఎద్దేవా చేశారు.

Tags

Read MoreRead Less
Next Story