Precaution Dose: వారు మాత్రమే ప్రికాషన్ డోసు తీసుకోవడానికి అర్హులు.. బుకింగ్ ఎలాగంటే..?

Precaution Dose: వారు మాత్రమే ప్రికాషన్ డోసు తీసుకోవడానికి అర్హులు.. బుకింగ్ ఎలాగంటే..?
Precaution Dose: రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకుంటేనే ఆఫీసుల్లోకి, దేవాలయాల్లోకి అనుమతిని ఇస్తామని రూల్ పెట్టారు.

Precaution Dose: కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఇబ్బంది పడినట్టుగా ఒమిక్రాన్ వేరియంట్‌తో ప్రజలు ఇబ్బంది పడకుండా కేంద్రం కీలక నిర్ణాయాలను తీసుకుంటోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ముందుకొచ్చి నైట్ కర్ఫ్యూను ప్రకటించాయి. మరికొన్ని రాష్ట్రాలు ఏకంగా లాక్‌డౌన్ పెట్టే ఆలోచనలో ఉన్నాయి. ఇక కేంద్రం అయితే పూర్తిగా వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టనుంది.

ఇప్పటికే రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకుంటేనే ఆఫీసుల్లోకి, దేవాలయాల్లోకి అనుమతిని ఇస్తామని రూల్ పెట్టారు. అయితే ఈ రెండు డోసులు వ్యాక్సిన్ కాకుండా బూస్టర్ డోస్ కూడా వేయించుకుంటే వైరస్ బారిన పడకుండా కాపాడుతుందని కొన్ని దేశాలు నమ్ముతున్నాయి. అందుకే పలు ఫారిన్ దేశాల్లో ప్రజలకు బూస్టర్ డోస్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అదే పని ఇండియా కూడా చేయనుంది.

బూస్టర్ డోస్‌లాగే పనిచేసే ప్రికాషన్ డోస్‌లను ప్రజలకు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. కానీ ముందుగానే ఈ ప్రికాషన్ డోసును ప్రతీ ఒక్కరికీ అందజేయట్లేదు. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 60 ఏళ్లు దాటి ఇతరత్రా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ డోసును అందించనుంది ప్రభుత్వం. కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన కొత్తలో ఎలా అయితే దానిని బుక్ చేసుకున్నామో ప్రికాషన్ డోసుకు కూడా అదే రకమైన పద్ధతి పాటించాల్సి ఉంటుంది.

నేషనల్‌ హెల్త్‌ అథారిటీ సీఈవో ఆర్‌ఎస్‌ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలో కనీసం 13.7 కోట్ల మంది ప్రికాషన్‌ డోసుకు అర్హులని తెలుస్తోంది. కానీ వ్యాక్సిన్ తీసుకున్న ఎన్నిరోజులకు ప్రికాషన్ డోసు తీసుకోవాలి లాంటి ఇతరేతర సమాచారం గురించి త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఎక్కువశాతం రెండు డోసులు తీసుకున్న 9-12 నెలల తర్వాత ప్రికాషన్ డోసు తీసుకోవాల్సి ఉంటుందని సమాచారం.

కొవిన్‌ పోర్టల్‌లోనే ప్రికాషన్ డోసు కూడా బుక్ చేసుకోవాల్సి ఉంటుందని శర్మ తెలిపారు. 60ఏళ్లు దాటిన వారు ప్రికాషన్‌ డోసు కోసం తమ అనారోగ్యానికి సంబంధించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇక మిగిలిన వివరాలను త్వరలోనే బయటపెడతాం అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story