Ethanol : చెరకు రసంతో ఇథనాల్‌ తయారీకి ఓకే

Ethanol : చెరకు రసంతో ఇథనాల్‌ తయారీకి ఓకే
కేంద్రం కీలక నిర్ణయం..

చెరకు రసం, B-హెవీ మొలాసిస్ ను ఉపయోగించి ఇథనాల్ తయారుచేసే పరిశ్రమలకు కేంద్రం అనుమతిచ్చింది. ఈ ప్రక్రియను నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చిన వారం రోజులకేకేంద్రం యూటర్న్ తీసుకుంది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ తరహాలో చక్కెర మళ్లింపును 17లక్షల టన్నులకు మాత్రమే కేంద్రం పరిమితం చేసింది. దేశంలో పెరుగుతున్న చక్కెర ధరలను అదుపు చేసేందుకు ఇథనాల్ తయారీకి చెరకు రసం ఉపయోగించరాదంటూ డిసెంబర్ 7న కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలంటూ పారిశ్రామిక వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో... తాజా నిర్ణయం తీసుకుంది. మంత్రుల కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా వెల్లడించారు. ఇథనాల్ తయారీకి ఉపయోగించాల్సిన చెరకు రసం, బి-హెవీ మొలాసిస్ నిష్పత్తిని నిర్ణయించేందుకు వివిధ పద్ధతుల్లో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత సంవత్సరంలో చెరకు రసాన్ని ఉపయోగించి ఇప్పటికే కొంత మేర ఇథనాల్ ఉత్పత్తి చేసినట్లు చెప్పారు.డిసెంబర్ 7న చెరకు రసం నుంచి ఇథనాల్ తయారీని నిలిపివేస్తూ ఉత్తర్వులు వెలువడినప్పటికే దాదాపు 6లక్షల టన్నుల మేర ఇథనాల్ ను తయారు చేసినట్లు మరో అధికారి వెల్లడించారు.

చెరకు రసంతో ఇథనాల్ తయారు చేస్తే చక్కెర ధరలు పెరిగే అవకాశం ఉన్నందు వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడిన తరుణంలో చక్కెర ధరలు పెరిగితే ప్రతికూల ప్రభావం ఉంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పారిశ్రామిక నిపుణులు చెబుతున్నారు.

2023-24 సీజన్‌లో ఇథనాల్ ఉత్పత్తికి చెరకు రసం లేదా సిరప్‌ను ఉపయోగించకూడదని దేశవ్యాప్తంగా ఉన్న చక్కెర మిల్లులు, డిస్టిలరీలకు కేంద్రం తెలిపింది. సరిపడా చక్కెర ఉత్పత్తితో పాటు, ధరలను అదుపులో ఉంచాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకు చెందిన చక్కెర, కూరగాయల నూనెల డైరెక్టరేట్ గురువారం దేశంలోని అన్ని చక్కెర మిల్లులు, డిస్టిల్లర్స్ సీఈఓలు, ఎండీలకు దేశీయ వినియోగానికి చక్కెర తగినంతగా అందుబాటులో ఉండేలా, ధరలు అదుపులో ఉండేలా చూడాలని స్పష్టం చేసింది. ఇథనాల్ తయారీకి చెరకు రసం ఉపయోగించరాదంటూ డిసెంబర్ 7న కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలంటూ పారిశ్రామిక వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో... తాజా నిర్ణయం తీసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story