Ayodhya Ram Mandir: సోషల్ మీడియాలో తప్పుడు సమాచార వ్యాప్తిపై కేంద్రం అలర్ట్

Ayodhya Ram Mandir:  సోషల్ మీడియాలో తప్పుడు సమాచార వ్యాప్తిపై కేంద్రం అలర్ట్
మీడియా సంస్థలకు, సోషల్ మీడియా మాధ్యమాలకు కేంద్రం ఆదేశాలు

అయోధ్యలో ఈనెల 22న జరిగే బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకకు సంబంధించి ఎలాంటి తప్పుడు సమాచారం ప్రచారం చేయొద్దని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాలకు సూచించింది. ఈ కార్యక్రమానికి సంబంధించి తప్పుడు సమాచారం ప్రచురితం కాకుండా, ప్రచారం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఈ వేడుకకు సంబంధించి అధికారికంగా ధ్రువీకరించని సమాచారం, రెచ్చగొట్టే, నకిలీ సందేశాలు సర్క్యులేట్‌ అవుతున్న విషయం తమ దృష్టికి వచ్చినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. అలాంటి తప్పుడు సమాచారంతో...శాంతిభద్రతలు, మత సామరస్యానికి విఘాతం కలుగుతుందని కేంద్రం పేర్కొంది.

అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ సమయంలో... ధ్రువీకరించని లేదా రెచ్చగొట్టే లేదా నకిలీ సందేశాలు వ్యాప్తి చెందుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇలా ఎక్కువగా జరుగుతోందని, ఇలాంటి వ్యవహారం శాంతిభద్రతలకు, మతసామరస్యానికి విఘాతం కలిగిస్తుందని తెలిపింది. ఇలాంటి తప్పుడు, మోసపూరిత సమాచారాన్ని ప్రచురించకుండా... ప్రసారం చేయకుండా వార్తాపత్రికలు, ప్రయివేటు శాటిలైట్ టీవీ ఛానళ్లు, డిజిటల్ మీడియా, కరెంట్ అఫైర్స్ పబ్లిషర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సోషల్ మీడియా వేదికలు సంబంధిత కంటెంట్‌ను కట్టడి చేయాలని ఆదేశించింది.


అయోధ్య రామ మందిరం పేరిట నకిలీ ప్రసాదం అమ్మకాలు చేపట్టిందన్న ఆరోపణలతో ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌కు కేంద్రం నోటీసులు ఇచ్చింది. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో అమెజాన్‌ సంస్థ ఆన్‌లైన్‌లో రామ మందిరం పేరిట నకిలీ ప్రసాదాన్ని విక్రయిస్తోందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్ ఇండియా ట్రేడర్స్‌ ఫిర్యాదు చేసింది. సాధారణ మిఠాయిలనే ‘శ్రీ రాం మందిర్ అయోధ్య ప్రసాదం’ పేరుతో ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారని ఆరోపించింది. తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఏఐటీ ఫిర్యాదు మేరకు వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ అమెజాన్‌ సంస్థకు నోటీసులు అందజేసింది.

ఈ నెల 22న రామ మందిర ప్రారంభోత్సవానికి దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన సుమారు 8 వేల మంది హాజరు కానున్నారు. ఇందులో రాజకీయ నేతలతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడ ఉన్నారు. సినీ ,పారిశ్రామిక, అధికార వర్గాలు కూడ ఉన్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలకు కూడ ఆహ్వానాలు వెళ్లాయి. అయితే ఈ ఆహ్వానాలను ఈ రెండు పార్టీలు తిరస్కరించాయి.

Tags

Read MoreRead Less
Next Story