Gujarat: మూడేళ్ళ లోపు పిల్లలకి నో స్కూల్

Gujarat: మూడేళ్ళ లోపు పిల్లలకి నో స్కూల్
చట్టవిరుద్ధమైన చర్యే అంటున్న గుజరాత్ హైకోర్టు

ప్రీస్కూల్‌ పేరుతో మూడేళ్ల వయసు నిండని పిల్లలను పాఠశాలకు పంపే తల్లిదండ్రులపై గుజరాత్‌ హైకోర్టు మండి పడింది. వారు చట్టవిరుద్ధమైన చర్యకు పాల్పడుతున్నట్లేనని గుజరాత్‌ వ్యాఖ్యానించింది. ఇకపై ప్రీస్కూళ్లు కూడా మూడేళ్లు నిండని పిల్లలకు చేర్చుకోవడానికి వీల్లేదని పేర్కొంది.

ప్రస్తుతం పోటీ ప్రపంచంలో తమ పిల్లలు పుట్టడంతోనే అన్నీ నేర్చుకోవాలని తల్లిదండ్రులు ఆశ పడుతున్నారు. దాని కోసం వారి పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారు. మూడేళ్ల లోపే వారిని ప్రీ స్కూల్ అంటూ జాయిన్ చేస్తున్నారు. దీంతో కొంత మంది పిల్లలు మానసిక ఒత్తిడి లోనవుతున్నారు. పిల్లలు స్కూల్ కు వెళ్లనని ఏడుస్తున్న కొట్టో, తిట్టో బలవంతంగా వారిని స్కూల్ కు పంపిస్తున్నారు. పై చదువులలో స్టాండర్డ్ బాగుండాలంటే ప్రీ స్కూల్ నుంచే మంచిగా చదవాలని వారిపై ప్రజెర్ పెంచుతున్నారు. అంతక ముందు 5 ఏళ్ల వయసు దాటితేనే స్కూల్ లో వేసే వారు. కానీ ఇప్పుడు మరీ 3 సంత్సరాలకే బడులకు పంపితే వారు తల్లి దండ్రులను మిస్ అవుతున్నారు. ఆడుకునే వయసులో వారి సమయాన్ని స్కూల్ లోనే గడపుతున్నారు. తల్లిదండ్రులు ఇలా చేస్తూ ఉండంతో ప్రభుత్వమే చిన్నారులకు అండగా నిలిచింది.


2023-24 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి ప్రవేశానికి కనీస వయస్సు ఆరేళ్లుగా నిర్ణయించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన కొన్ని పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. విద్యాహక్కు చట్టం-2012 నిబంధనల ప్రకారం మూడేళ్లు నిండని పిల్లలను ప్రీస్కూల్‌లో చేర్చుకోరాదని పేర్కొంది. ఒకటో తరగతిలో చేరడానికి కనీస వయసు ఆరేళ్లు తప్పనిసరిగా ఉండాలంటూ గుజరాత్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. జూన్ 1 నాటికి ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న తమ పిల్లల కోసం అడ్మిషన్ కోరుతున్న తల్లిదండ్రుల బృందం జనవరి 31, 2020 నాటి నోటిఫికేషన్‌ను సవాలు చేసింది.

ఈ తీర్పును కొంత మంది తల్లిదండ్రలు స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దీని వల్ల పిల్లలపై మానసిక ఒత్తిడి తగ్గుతుందని కూడా నిపుణులు తెలుపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story