గుజరాత్ లో ఉగ్ర కుట్ర భగ్నం.. నలుగురు అరెస్ట్

గుజరాత్ లో ఉగ్ర కుట్ర భగ్నం.. నలుగురు అరెస్ట్
గుజరాత్ లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం చేసిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్.. నలుగురు అరెస్ట్

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో అనుబంధం ఉన్న నలుగురు వ్యక్తులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోరుబందర్ నుంచి ఆ వ్యక్తులు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థతో కలిసి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు.

గుజరాత్ ఏటీఎస్ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. పోరు బందర్ పట్టణంలో ఇస్లామిక్ స్టేట్ మాడ్యూల్ గుట్టురట్టు చేశారు. ఒక మహిళతో కలిపి నలుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ప్రస్తుతానికి ఒక విదేశీయుని ఇంట్లో సోదాలు జరుగుతున్నట్లుగా సమాచారం. గుజరాత్ డిజిపి వికాస్ సహాయ దీనిపై మీడియా ప్రకటన చేశారు. కోరా సన్ ప్రావిన్స్ కు చెందిన నలుగురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.


అరెస్ట్ అయిన నలుగురు వ్యక్తులు ఐసిస్ టెర్రర్ మాడ్యూల్ లో భాగమన్న ప్రాధమిక సమాచారం మేరకు ఏటిఎస్ సిబ్బంది దాడులు నిర్వహించారు. నిందితులంతా ఒక ఏడాది నుంచి సంబంధాలను కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరి నుంచి వారి గుర్తింపు పత్రాలు, మొబైల్ ఫోన్ లు, టాబ్లెట్లు వంటి డిజిటల్ కమ్యూనికేషన్ పరికరాలు, కొన్ని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

అలాగే పాకిస్తాన్లోని హ్యాండలర్స్ వీరిని రాడికలైజ్ చేసినట్లుగా గుర్తించారు. ఆ హ్యాండ్లర్ల సలహాలు, సూచనలు తోనే వారు పోరుబందరుకు చేరుకున్నారని, అక్కడి నుంచి కొద్దిరోజుల పాటు షిప్పింగ్ బూతులో కార్మికులుగా ఉపాధి పొందాలని తరువాత ఒక నిర్ణీత సమయాన్ని కల్లా దేశం విడిచి వెళ్లడానికి, ఐసిసి ఉగ్రవాద సంస్థలో చేరడానికి వీరు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని సమాచారం. విషయాలాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని వారిని గత కొంత కాలంగా నిరంతరం గమనిస్తూ చివరకు అరెస్టు చేశామన్నని ప్రకటించింది యాంటీ టెర్రరెస్ట్ స్క్వాడ్.

Tags

Read MoreRead Less
Next Story