Husband Arrest : జైలు -జామీను - ఓ జంట కధ

Husband Arrest : జైలు -జామీను - ఓ  జంట కధ
భర్తను ఏడుసార్లు జైలుకు పంపించిన భార్య, 8 సారి ఏం జరిగిందంటే..

వివాహం అయిన తరువాత ఆ దంపతుల జీవితంలో గొడవలు కామన్. కొన్ని వాదోపవాదాలు భార్యభర్తలను వేరు చేస్తే, మరికొన్ని సర్దుకుపోయి కలిసుండేలా చేస్తాయి. కానీ ఏదన్నా గొడవ ముదిరి దంపతుల రిలేషన్‌షిప్‌లో చీలిక వస్తే మళ్లీ కలిసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక అప్పుడు వాళ్ళు ఇద్దరు మళ్లీ కలుస్తారని గ్యారెంటీ లేదు.

కానీ, గుజరాత్‌కు చెందిన ఓ భార్యాభర్తల జంట కధ మాత్రం చాలా వింతైనది. ప్రేమ్‌చంద్ మాలి, సోనూ రీటా అనే దంపతుల వివాహ జీవితం విచిత్రమైనది. వాళ్ళు కొన్నాళ్ళ పాటు కలిసి జీవిస్తారు. మళ్ళీ కొన్నాళ్ళు విడిపోతారు.. విడిపోవడం అంటే ఏదో వేర్వేరు ఇళ్లలో ఉండటం కాదండోయ్ ఆ టైమ్ లో ప్రేమ్‌చంద్ జైలులో రిలాక్స్ అవుతాడన్నమాట. ఏంటి అర్థం కావట్లేదా రండి అయితే ఈ స్టోరీ డిటైర్డ్ గా తెలుసుకుందాం..

గుజరాత్‌లోని మెహసానా గ్రామానికి చెందిన ప్రేమ్‌చంద్ మాలి, సోనూ 2001లో వివాహం చేసుకున్నారు. ప్రేమ్‌చంద్ మాలి కూలీ గా ఉండి కుటుంబాన్ని పోషించాడు. వారి మధ్య ఆర్థిక సమస్య తప్ప మరో తీవ్రమైన సమస్య లేదు. అయితే 2014లో ప్రేమ్ చంద్, సోనూ దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి.


2015లో భర్త ప్రేమ్‌చంద్‌పై అతని భార్య సోనూ మొదటి సారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భౌతిక దాడి, మానసిక వేధింపుల కింద కేసు నమోదు చేశారు. ప్రేమ్ చంద్ జైలు పాలయ్యాడు. ఐదు నెలల తరువాత జైలులో ఉన్న తన భర్తప్రేమ్ చంద్ కు వ్యక్తిగతంగా బెయిల్ ఇచ్చిన సోనూ అతన్ని విడుదల అయ్యేలా చేసింది. సరిగ్గా ఒక 6 నెలల తర్వాత భార్య సోనూ తన భర్తపై మరోసారి శారీరక దాడి, మానసిక వేధింపుల కేసుల కింద అరెస్టు చేయించి జైలుకు పంపించింది. ఇలా 2016 నుంచి 2020 వరకు సుమారు 7 సార్లు జైలు పాలయ్యాడు ప్రేమ్ చంద్. గొడవ అయిన ప్రతిసారీ నెలల పాటు ప్రేమ్ చంద్ జైలు శిక్ష అనుభవించాడు. జైలుకి పంపటం తరువాత కొంత కాలానికి భార్య మనసు కరిగిపోయి ఆమే బెయిల్ ఇచ్చి భర్త ప్రేమ్ చంద్ ను బయటకు తీసుకురావటం రొటీన్ అయిపోయింది.

ఇలా 2022 ప్రారంభంలో అరెస్ట్ అయిన ప్రేమ్ భార్య బెయిల్ జూలై నెలలో బయటకు వచ్చాడు.. ఇప్పుడు తాజాగా ప్రేమ్ చంద్ మొబైల్ మిస్ అయ్యింది. ఇక అక్కడ మొదలైన గొడవ ఎక్కడికి వెళుతుందో తెలుసు కాబట్టి ఈసారి భర్త ప్రేమ్‌చంద్ తన భార్య సోనీపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు..తన భార్య నుంచే కాదు తన కుమారుడి నుంచి కూడా ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు.. ప్రస్తుతం వారి భవితవ్యం పోలీసులు, కోర్టు చేతిలో ఉంది.

Tags

Read MoreRead Less
Next Story