Gyanvapi: జ్ఞానవాపి కేసులో కీలక మలుపు.. ASI సర్వేకు కోర్టు ఓకే

Gyanvapi: జ్ఞానవాపి కేసులో కీలక మలుపు.. ASI సర్వేకు కోర్టు ఓకే
జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పు... భారత పురావస్తు పరిశోధనా సంస్థ సర్వేకు అనుమతి

జ్ఞానవాపి మసీదు (Gyanvapi mosque) ప్రాంగణంలో భారత పురావస్తు పరిశోధనా సంస్థ(ASI)తో శాస్త్రీయ సర్వే చేయించడానికి వారణాసి జిల్లా కోర్టు అనుమతిచింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీజ్ చేసిన వజుఖానా ప్రాంతం మినహా మిగతా ప్రాంగణమంతా సర్వే చేయాలని ఆదేశించింది. ఆగష్టు 4లోగా నివేదికను సమర్పించాలని ASIని ఆదేశించింది. కాశీ విశ్వనాథ ఆలయం చెంతనే ఉన్న జ్ఞానవాపి మసీదు (Gyanvapi mosque)లో శాస్త్రీయ సర్వే (scientific survey) నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై వారణాసి కోర్టు (Varanasi Court) తీర్పు వెలువరించింది. ఈ మసీదు ప్రాంగణమంతా ద్వారా సర్వే చేసేందుకు న్యాయస్థానం అనుమతినిచ్చిందని హిందూ ప్రతినిధుల తరఫున వాదలు వినిపిస్తున్న న్యాయవాది విష్ణు శంకర్‌ జైన్‌ వెల్లడించారు.


కాశీ విశ్వనాథునికి ఎదురుగా ఉన్న జ్ఞాణవాపి మసీదు పురాతన హిందూ దేవాలయం ఆనవాళ్లను కలిగి ఉందని నలుగురు మహిళలు ఈ ఏడాది మే నెలలో కోర్టుఉ ఆశ్రయించారు. మసీదు ప్రాంగణంలో స్వయంభు జ్యోతిర్లింగం ఉండేదని, ముస్లిం పాలకుల దండయాత్రలో ధ్వంసమైందని వారి పిటిషన్‌దారులు పేర్కొన్నారు. అయితే.. మసీదు కమిటీ వీరి వాదనలను ఖండించింది. ఏఎస్‌ఐ సర్వే మసీదు నిర్మాణాలను దెబ్బతీస్తుందని అన్నారు

జ్ఞానవాపి మసీదు (Gyanvapi mosque) వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కొందరు హిందూ మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌ మేరకు వారణాసి కోర్టు ఆ ప్రార్థనా స్థలంలో గతంలో వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశించింది. సర్వే కొనసాగుతుండగా అక్కడ శివలింగం కనిపించిందంటూ హిందూ పక్షం వేసిన పిటిషన్‌పై స్పందించిన కోర్టు.. ఆ ప్రదేశాన్ని సీల్‌ చేయాలని, సీఆర్పీఎఫ్‌ భద్రతలో ఉంచాలని ఉత్తర్వులిచ్చింది.


ఆ తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరగా మసీదులో శివలింగం కనిపించిందంటున్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని ఆదేశాలిచ్చింది. అయితే, ఈ కేసు సున్నితత్వం దృష్ట్యా సీనియర్‌ జడ్జితో విచారణ చేపట్టాలని ఆదేశిస్తూ కేసును వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. గత ఏడాది నిర్వహించిన వీడియోగ్రఫిక్ సర్వేలో కనుగొన్నామని చెబుతున్న శివలింగానికి కార్బన్ డేటింగ్ ప్రక్రియను సుప్రీంకోర్టు నిషేధించింది. అంతేకాకుండా సైంటిఫిక్ సర్వేని విభేదించింది. వజుఖానాని సీలింగ్ చేయాలని ఆదేశించింది. ఈ అంశంపై వారణాసి కోర్టులో విచారణ జరుగుతుండగా.. హిందూ భక్తులు మరో పిటిషన్‌ దాఖలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story