65 ఏళ్ల వయసులో పెళ్లిచేసుకున్న న్యాయవాది హరీష్ సాల్వే

65 ఏళ్ల వయసులో పెళ్లిచేసుకున్న న్యాయవాది హరీష్ సాల్వే
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే 65 ఏళ్ల వయసులో ఓ ఇంటివాడయ్యారు. లండన్ కు చెందిన ఆర్టిస్ట్.. కరోలిన్ బ్రోసార్డ్ ను బుధవారం..

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే 65 ఏళ్ల వయసులో ఓ ఇంటివాడయ్యారు. లండన్ కు చెందిన ఆర్టిస్ట్.. కరోలిన్ బ్రోసార్డ్ ను బుధవారం ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు.ఈ కార్యక్రమం ఓ చర్చిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరుకుటుంబాలకు చెందిన సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. 1955 లో మహారాష్ట్రలో జన్మించిన హరీష్ సాల్వే సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. హరీష్ సాల్వే 2017 మేలో కుల్భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం ముందు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.

Tags

Read MoreRead Less
Next Story