Unmarried Pension Scheme: ఇకపై పెళ్లి కాని వారికి పింఛన్.. ఎక్కడంటే

Unmarried Pension Scheme: ఇకపై పెళ్లి కాని వారికి పింఛన్.. ఎక్కడంటే
వృద్ధులు, వితంతువుల మాదిరిగానే పెళ్లి కాని వారికి పెన్షన్లు

హర్యానా ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు అవివాహితులైన స్త్రీ, పురుషులకు పింఛన్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. నెల రోజుల్లో ఈ పింఛన్‌కు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్టు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ ప్రకటించారు.

వృద్ధాప్య పింఛన్లు ఉన్నాయి, వితంతు పింఛన్లు ఉన్నాయి, వికలాంగుల పింఛన్లు కూడా ఉన్నాయి. నిరుద్యోగులకు కూడా పెన్షన్ ఉంది. కానీ పాపం పెళ్లి కాని వారి పరిస్థితి ఏంటి. ఇదే ప్రశ్న అడిగారు ఓ 60 ఏళ్ల అవివాహిత. ఏ తోడూ లేని తనకు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆర్జీ పెట్టుకున్నారు. దీనికి సమాధానం ఇస్తూ హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ అందుకు అనుగుణంగా పథకం ప్రారంభిస్తామని పేర్కొన్నారు.





ఈ పధకం ప్రకారం 45 నుండి 60 సంవత్సరాల వయస్సు గల అవివాహితులకు పెన్షన్ ఇవ్వాలని, ఇందులో స్త్రీలు, పురుషులు ఇద్దరూ ప్రయోజనాలు పొందాలనేది ప్రభుత్వ యోచన. పింఛను ఎంత ఉండవచ్చు అనే అంశం పై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ పధకానికి అర్హులు అవ్వాలి అంటే లబ్ధిదారు హర్యానా వాసి అయి, అవివాహితులై ఉండాలి. ఒక్కసారి కూడా పెళ్లి కాని వారికి మాత్రమే ఈ పెన్షన్ పథకం వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. సంవత్సర ఆదాయం రూ. 1.80 లక్షలకు మించకుండా ఉండాలనే షరతులు కూడా ఉన్నాయి. ఈ పథకం అమల్లోకి వస్తే 1.25 లక్షల మందికి ఈ పింఛను అందుతుందని కొన్ని నివేదికలు తెలిపాయి. దీనిపై నెల రోజుల్లోగా పూర్తి నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

ప్రస్తుతం, హర్యానా ప్రభుత్వం పౌరులకు వృద్ధాప్య, వితంతువు, వికలాంగుల పెన్షన్‌ను అందిస్తోంది. వృద్ధాప్య పింఛను పథకం కింద మూడు వేల రూపాయలు అందిస్తోంది. పెళ్లికాని వారికి పింఛను పథకం కింద కూడా ఇంతే మొత్తాన్ని పింఛన్ గా ఇవ్వవచ్చని భావిస్తున్నారు. మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన ఈ ప్రకటనలో హర్యానాలో పెళ్లి కాకుండా ఉన్న స్త్రీ, పురుషులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story