Anti-biotics: యాంటీ బయోటిక్స్‌పై డాక్టర్లకు కేంద్రం కీలకఆదేశాలు

Anti-biotics: యాంటీ బయోటిక్స్‌పై డాక్టర్లకు కేంద్రం కీలకఆదేశాలు
కారణం తెలియజేయాలన్న కేంద్రం..

అనారోగ్య బాధితులకు యాంటీ బయోటిక్స్ మందులను సిఫార్సు చేసేటప్పుడు,. అందుకు గల కారణాలను తప్పనిసరిగా మందుల చిట్టీలో తెలియజేయాలని వైద్యులను కేంద్ర ఆరోగ్యశాఖ కోరింది. అర్హులైన వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే యాంటీ బయోటిక్స్ ను విక్రయించాలని ఫార్మసిస్టులకు సూచించింది. వైద్యసేవల డైరక్టర్ డాక్టర్ అతుల్ గోయెల్ దేశవ్యాప్తంగా ఉన్న వైద్య, ఫార్మసిస్టు సంఘాలకు ఈ మేరకు లేఖ రాశారు. యాంటిబయోటిక్స్ ఔషధ వినియోగం అధికమైతే రోగుల్లో నిరోధకం పెరిగి దుష్పరిణామాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ సూచనలు జారీ అయ్యాయి.

యాంటీ బయోటిక్స్, యాంటీ మైక్రోబయల్ మందులను రోగులకు సూచించే అంశంపై డాక్టర్లకు కేంద్ర సర్కారు కీలక సూచనలు చేసింది. వాటిని రోగులకు సూచించేటప్పుడు కచ్చితమైన కారణాన్ని తప్పనిసరిగా పేర్కొనాలంటూ వైద్యులకు కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) ఒక అడ్వెజరీని జారీ చేసింది. యాంటీ మైక్రోబయల్స్ను అతిగా వాడటం వల్ల యాంటీ మైక్రోబయల్స్ రెసిస్టెంట్ (ఏఎంఆర్) వ్యాధికారకాలు, సూక్ష్మక్రిములు ఏర్పడుతున్నాయనే ఆందోళనల నేపథ్యంలో ఈ అడ్వెజరీని విడుదల చేశామని కేంద్రం పేర్కొంది. 2019 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఏఎంఆర్ విపత్తు వల్ల 12.7 లక్షల మరణాలు, డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్ల వల్ల 49.50 లక్షల మరణాలు సంభవించాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న ఫార్మసిస్టులు కూడా డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లు లేకుండా నేరుగా యాంటీ బయోటిక్స్ అమ్మకాలను నిలిపివేయాలని ప్రభుత్వం కోరింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్ 1945 ప్రకారం.. యాంటీ బయోటిక్స్ అనేవి షెడ్యూల్ హెచ్ కింద పేర్కొన్న ఔషధాల జాబితాలో ఉన్నాయి. వీటిని కనీసం రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (RMP) ప్రిస్క్రిప్షన్పై మాత్రమే రిటైల్గా విక్రయించాలి.

మితిమీరిన యాంటీ బయాటిక్స్ భవిష్యత్తులో డ్రగ్ రెసిస్టెంట్కి కారణమవుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఒక వేళ అదే జరిగితే మొండి బ్యాక్టీరియా రోగాలు యాంటీ బయాటిక్స్ ్న ప్రతిఘటించే అవకాశం ఉంది. యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) అనేది ప్రపంచానికి ముప్పు కలిగించే అంశాల్లో ఒకటిగా ఉంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను అదుపు చేయడంతో యాంటీ బయాటిక్స్ ఓడిపోతే ప్రజాఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే. ఈ కారణాల వల్లే ప్రభుత్వం వీటిపై సూచనలు చేసినట్లు తెలుస్తోంది.


Tags

Read MoreRead Less
Next Story