Hemant Soren: హేమంత్‌ సోరెన్‌కు తాజాగా మరోసారి ఈడీ నోటీసులు..

Hemant Soren: హేమంత్‌ సోరెన్‌కు తాజాగా మరోసారి ఈడీ నోటీసులు..
ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ యాక్ట్‌ కింద ,,,

మనీలాండరింగ్‌ కేసులో జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు ఈడీ మరోసారి మళ్లీ సమన్లు జారీచేసింది. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ యాక్ట్‌ (PMLA) కింద స్టేట్‌మెంట్‌ రికార్డింగ్‌ ఇంకా పూర్తికాలేదని.. మరోసారి ప్రశ్నించాల్సి ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో జనవరి 27 నుంచి 31లోగా జోనల్‌ ఆఫీస్‌కు రావాలని అందులో పేర్కొంది. ఇదే కేసులో ఈ నెల 20న ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించిన విషయం తెలిసిందే.

గత శనివారం రాచీలోని సీఎం అధికారిక నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు.. సుమారు 7 గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు. జార్ఖండ్‌లో భూమి యాజమాన్యాన్ని అక్రమంగా మార్చే భారీ మాఫియాకు సంబంధించిన స్కామ్‌పై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 14 మందిని ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. 2011 బ్యాచ్ ఐఏఎస్‌ అధికారి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా, రాంచీ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన రంజన్‌ను కూడా ఈ కేసులో అరెస్ట్‌ చేశారు. పశ్చిమ బంగాల్‌లో ఇటీవల ఈడీ అధికారులపై దాడి జరిగిన నేపథ్యంలో...ఈ మేరకు భద్రత కల్పించారు. సోరెన్‌ నివాసం చుట్టూ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేసేందుకు వీలుగా CISF బృందాలు హై-రిజల్యుషన్‌ బాడీ కెమెరాలు వినియోగిస్తున్నాయి. విల్లు, బాణాలు పట్టుకొని JMMశ్రేణులు తరలిరావటంతో సీఎం నివాసానికి వంద మీటర్ల దూరంలో పోలీసులు వారిని నిలిపివేశారు. అధికార ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా-JMMకు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న హేమంత్‌ సోరెన్‌ ఈడీ అధికారులు గతంలో ఏడుసార్లు నోటీసులు జారీ చేసినా విచారణకు హాజరు కాలేదు. ఎనిమిదోసారి సమన్లు ఇవ్వటంతో విచారణకు అంగీకరించారు.

జార్ఖండ్‌లో భూమి యాజమాన్యాన్ని అక్రమంగా మార్చే భారీ మాఫియాకు సంబంధించిన స్కామ్‌పై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 14 మందిని ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. 2011 బ్యాచ్ ఐఏఎస్‌ అధికారి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా, రాంచీ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన రంజన్‌ను కూడా ఈ కేసులో అరెస్ట్‌ చేశారు.కాగా, భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో జార్ఖండ్‌ సీఎం హేమంత్ సోరెన్‌కు ఈడీ ఇప్పటికే ఏడుసార్లు సమన్లు జారీ చేసింది. ఈ నెలలో జారీ చేసిన చివరి సమన్లకు కూడా ఆయన స్పందించలేదు. ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే అన్ని పత్రాలను ఈడీకి పంపినట్లు ఆయన తెలిపారు. తనకు సమన్లు జారీ చేయడం అక్రమం అని ఆరోపించారు. సమన్లకు హేమంత్‌ సోరెన్‌ స్పందించకపోవడంతో ఈడీ అధికారులు శనివారం ఆయన ఇంటికి వచ్చి ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story