PM Modi: ఆర్టికల్ 370 వల్లే జమ్ముకశ్మీర్​లో ప్రశాంత వాతావరణం-మోడీ

PM Modi: ఆర్టికల్ 370 వల్లే జమ్ముకశ్మీర్​లో ప్రశాంత వాతావరణం-మోడీ
బీజేపీ 370 సీట్లు గెలువడంలో భాగస్వామ్యం కమ్మని పిలుపు

వికసిత భారత్‌ అంటే వికసిత జమ్ముకశ్మీర్‌ అని ప్రధాని మోదీ తెలిపారు. గతంలో ఇక్కడి ప్రభుత్వాలు తమ కుటుంబం గురించి తప్ప ప్రజల బాగోగులు పట్టించుకునేవి కావన్నారు. ఇప్పుడు జమ్ముకశ్మీర్‌ కుటుంబ పాలన నుంచి బయటపడటం సంతోషంగా ఉందన్నారు. 370అధికరణ రద్దు తర్వాత తొలిసారి జమ్ముకశ్మీర్‌ ప్రజలకు రాజ్యాంగంలో పేర్కొన్న సామాజిక న్యాయానికి హామీ లభించిందని ప్రధాని మోదీ తెలిపారు.

ప్రత్యేకాధికారాలు కల్పించే 370అధికరణ జమ్ముకశ్మీర్‌కు అభివృద్ధికి అతిపెద్ద అవరోధంగా ఉండేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. 370 అధికరణ రద్దు తర్వాత కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్ముకశ్మీర్‌లోని అన్నిప్రాంతాలు, అన్ని రంగాలు సమంగా అభివృద్ధిని చూస్తున్నాయని చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో 32వేల కోట్లతో చేపట్టిన వివిఅభివృద్ధి ప్రాజెక్టులుసహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 13వేల 500కోట్ల వ్యయంతో చేపట్టిన I.I.T.లు, I.I.M.లు, కేంద్ర విశ్వవిద్యాలయాలు సహా పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అందులోఐఐఎం జమ్ము, బోధ్‌ గయా, విశాఖ క్యాంపస్‌లు ఉన్నాయి. ఐఐటీ బిలాయ్‌, ఐఐటీ తిరుపతి, ఐఐటీ జమ్ము, ట్రిపుల్‌ ఐటీ కాంచీపురం శాశ్వత భవనాలను కూడా జాతికి అంకితం ఇచ్చారు. కాన్పుర్‌లో నిర్మించిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ స్కిల్స్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 20 కేంద్రీయ, 13 నవోదయ విద్యాలయ భవనాలకు...ప్రారంభోత్సవం చేశారు. మరికొన్ని కేంద్రీయ విద్యాలయ భవనాలకు శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్‌ లోని విశాఖ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ -IIMశాశ్వత భవనాన్ని ...ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. కర్నూలులో నిర్మించిన ట్రిపుల్ ఐటీని కూడా ప్రధాని జాతికి అంకితమిచ్చారు. ఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌, మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో వివిధ అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. జమ్ముకశ్మీర్‌లో ఉద్యోగాలు పొందిన 1500 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఆ తర్వాత వికసిత్‌ భారత్‌, వికసిత్‌ జమ్ము ద్వారా లబ్ధి పొందినవారితో ప్రధాని మోదీ ముఖాముఖి నిర్వహించారు. మొదటిసారి...ప్రభుత్వం ప్రజల ఇళ్లవద్దకు వచ్చిందన్నారు. ఇది మోదీ భరోసా అని, ఇకముందు కూడా కొనసాగుతుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

దేశంలోనే అతి పొడవైన రైల్వే సొరంగం ఉధంపుర్‌-శ్రీనగర్‌-బారాముల్లా రైల్వే లింక్‌ను ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. 48.1కిలోమీటర్ల పొడవైన రైల్వే సొరంగం పనులు 2010లో ప్రారంభంకాగా 14ఏళ్ల తర్వాత పూర్తయ్యాయి. అంతేకాకుండా కశ్మీర్‌ లోయలో తొలిసారి రెండు విద్యుత్తు రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. అందులో ఒకటి శ్రీనగర్‌-సంగల్‌దాన్‌, మరొకటి సంగల్‌దాన్‌-శ్రీనగర్‌ విద్యుత్తు రైళ్లు ఉన్నాయి. దేశంలో కోటి మంది మహిళలను లక్‌పతి దీదీని చేసేందుకుగాను మహిళలు మద్దతు ఇవ్వాలని ప్రధాని మోదీ కోరారు.

Tags

Read MoreRead Less
Next Story