Rat hole Miners: అద్భుతం సృష్టించిన ర్యాట్ హోల్ మైనర్స్

Rat hole Miners: అద్భుతం సృష్టించిన ర్యాట్ హోల్ మైనర్స్
ఇంతకు వాళ్ళు ఏం చేశారంటే ?

ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు మొదట్లో చేసిన రకరకాల ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి, దిల్లీ నుంచి వెళ్ళిన 'ర్యాట్ హోల్ మైనర్స్' ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను విజయవంతం చేసి హీరోలుగా మారారు.

విదేశీ యంత్రాలు విఫలమైన వేళ.. దేశీయ నిపుణుల శ్రమ ఫలితాలను ఇచ్చింది. ‘ర్యాట్‌ హోల్‌ మైనర్లు’ (బొగ్గు గనుల్లో సన్నని మార్గాలను తవ్వడంలో నిపుణులు) అద్భుతం చేశారు. సోమవారం రాత్రి నుంచి మెరుపు వేగంతో తవ్వకాలు చేపట్టినే 12 మంది ర్యాట్ హోల్ మైనర్లు.. 57 మీటర్ల డ్రిల్లింగ్‌ పూర్తి చేసి.. కూలీలు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఆ తర్వాత గొట్టాన్ని పంపించి అందులో నుంచి కార్మికులను ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చారు. టన్నెల్ వెలువల అప్పటికే సిద్ధంగా ఉంచిన అంబులెన్స్‌లలో కూలీలను ఆసుపత్రికి తరలించారు.

ఒకానొక సమయంలో కార్మికులు చిక్కుకున్న ప్రదేశానికి కొన్ని మీటర్ల దూరం వరకూ ఉన్న శిథిలాలను ఈ ర్యాట్ హోల్ మైనర్లే తవ్వుకుంటూ ముందుకు వెళ్ళారు. 12 మందితో కూడిన ఈ మైనర్ల బృందం సొరంగంలో కార్మికులున్న దగ్గరికి చేరుకునేందుకు వారు ఉలి, సుత్తి పట్టుకుని తవ్వుకుంటూ రక్షణ కార్యక్రమంలో చివరి అడుగు వేశారు.

ఈ ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏమిటి?

ర్యాట్ హోల్ మైనింగ్ పదాన్ని తొలుత బ్రిటన్ ప్రజలు ఉపయోగించేవారు. ఆ దేశంలో మైనింగ్ మొదలైన తొలి నాళ్లలో అంటే 1920 కాలం నుంచే ఈ పనులు ప్రారంభించారని సమాచారం. అప్పట్లో ఇదే విధానంలో బొగ్గు గనుల నుంచి బొగ్గును బయటికి వెలికితీసేవారు. ఉపరితలంలో ర్యాట్స్ అతిపెద్ద రంధ్రాలు చేస్తారు.ఆకాలంలో మైనింగ్‌లో ఎలాంటి మిషన్లను, పేలుళ్లను వాడే వారు కాదు. భూఉపరితలంలో ఉన్న బొగ్గును చేరుకునేందుకు ఉలి, సుత్తి, రాడ్ల సాయంతో బొగ్గు గనులను తవ్వేవారు. దీనినే ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటారు.


అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో, అశాస్త్రీయ విధానంలో జరిగే ఈ ర్యాట్‌హోల్ మైనింగ్‌‌పై 2014లో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్‌జీటీ) నిషేధం విధించింది. పర్యావరణ సమస్యలతో పాటు కార్మికుల ప్రాణాల రక్షణ దృష్టితో నిషేధం విధిస్తున్నట్లు ట్రైబ్యునల్ చెప్పింది. ‘ర్యాట్ హోల్ మైనింగ్’ చట్టవిరుద్ధం అయినప్పటికీ, మిషన్లు చేరుకోలేని పర్వత ప్రాంతాల్లో రాళ్లను తొలగించుకుంటూ ముందుకెళ్లే అనుభవం ఈ పనులు చేసే వారికి ఉంటుంది . వీరికి పర్వతాల గురించి తెలుసు. ఈ ప్రాంతాల్లో ఉండే రాళ్ల అమరిక గురించి అవగాహన ఉంటుంది. వాటి లోపలికి ఎలా చొచ్చుకుపోవాలో వారికి తెలుసు. ఈ పనిని అధునాతన మెషిన్లతో చేయరు. ఎందుకంటే వారికంటూ కొన్ని పరిమితులుంటాయి. ఆగర్ మిషన్ కూడా ఇక్కడ పనిచేయదు.


Tags

Read MoreRead Less
Next Story