irat Kohli: భావితరాలకు కోహ్లీ ఓ బెంచ్‌మార్క్‌

irat Kohli: భావితరాలకు కోహ్లీ ఓ బెంచ్‌మార్క్‌
టీమిండియాను అభినందించిన ప్రధాని మోడీ

వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరిన భారత క్రికెట్ జట్టును ప్రధాని మోడీ అభినందించారు. సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 70 పరుగుల తేడాతో గెలిచాక ప్రధాని ట్విటర్‌లో బుధవారం ప్రత్యేక సందేశాన్ని పోస్ట్ చేశారు. 'భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, విశేషమైన శైలిలో ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. అద్భుతమైన బ్యాటింగ్, మంచి బౌలింగ్ మన జట్టుకు మ్యాచ్‌ని కట్టబెట్టింది.' అని ట్వీట్ చేశారు.

న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో భారత్ అద్భుతమైన స్కోర్ చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. ప్రపంచకప్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌లో ఏ జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం. భారత్‌ను ఇంత పెద్ద స్కోరుకు తీసుకెళ్లడంలో విరాట్‌ కోహ్లి పాత్ర ఎంతో ఉంది. విరాట్ 113 బంతుల్లో 117 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని వన్డే కెరీర్‌లో 50వ సెంచరీని నమోదు చేశాడు.


ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఎన్నో రికార్డులు సృష్టించినప్పటికీ, వన్డే ఫార్మాట్‌లో 50 సెంచరీలు చేయడం అత్యంత ప్రత్యేకమైన రికార్డులలో ఒకటిగా నిలిచింది. దీనిపైనే అందరి దృష్టి నెలకొన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి, విరాట్ తన 50వ సెంచరీని సాధించాడు. సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 49 ODI సెంచరీల రికార్డును వదిలిపెట్టాడు. ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. దీంతో విరాట్ సోషల్ మీడియాలో కోహ్లీ పేరు మార్మోగిపోతోంది. సచిన్ టెండూల్కర్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ దిగ్గజాలందరూ అతనికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా సోషల్ మీడియా ద్వారా కింగ్ కోహ్లీకి శుభాకాంక్షలు తెలిపారు.

తాను విరాట్ కొహ్లీకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాననని మోడీ తెలిపారు. భవిష్యత్ తరాలకు ఆయన ఒక బెంచ్‌మార్క్‌ని నెలకొల్పుతూనే ఉంటాడని మోడీ ఆకాంక్షించారు. తద్వారా విరాట్ కొహ్లీ సాధించిన ఘనత దేశంలోని ప్రజలతో పాటు భవిష్యత్ తరాలకు కూడా స్ఫూర్తిదాయయం కావాలని కోరుకుంటున్నానన్నారు.

Tags

Read MoreRead Less
Next Story