Rahul Gandhi : రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకుంటున్న మోడీ..

Rahul Gandhi : రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకుంటున్న మోడీ..
బీజేపీ పై రాహుల్ ఎదురుదాడి

రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న భారతీయ జనతా పార్టీ కుట్రలను ఇండియా కూటమి అడ్డుకుని తీరుతుందని...కాంగ్రెస్ అధినేతరాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని భాజపా రద్దు చేయాలనుకుంటోంది: రాహుల్ గాంధీతేల్చిచెప్పారు. బిహార్‌, యూపీలో ప్రచారం నిర్వహించిన ఆయన...మోదీ సర్కార్‌పై పనితీరుతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. చార్‌ సౌ పార్‌ అని భాజపా చేస్తున్న ప్రచారం బోగస్‌ అని రాహుల్‌ అన్నారు. తొలిదశ ఫలితాల్లో కాంగ్రెస్‌, ఇండియా కూటమిని ప్రజలు తిరస్కరించారన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను ప్రియాంక తిప్పికొట్టారు.

దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్నిరద్దు చేయాలన్న భాజపా, R.S.Sల కుట్రలను ఇండియా కూటమి అడ్డుకుని తీరుతుుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశంలో పేదలు, దళితులు, గిరిజనులు ఏదైనా సాధించారంటేnఅది కేవలం రాజ్యాంగం ద్వారా మాత్రమేనని, అది రద్దయితే మళ్లీ పాతరోజులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం చేసిన రాహుల్... కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. 70కోట్ల మంది ప్రజలతో ఉన్నంత డబ్బు కేవలం 22మంది సంపన్నుల వద్ద ఉందని రాహుల్ తెలిపారు. బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం డబ్బును ప్రధాని మోదీ ఆ 22 మందికి పంచారని విమర్శించారు. ఆ సంపన్నులు చైనా ఉత్పత్తులను దేశంలో విక్రయిస్తున్నారని

రాహుల్ దుయ్యబట్టారు. మేకిన్ ఇండియా నినాదాన్ని నిజం చేయగలిగే సత్తా కలిగిన చిన్న వ్యాపారులు, చేతివృత్తుల వారిని నోట్ల రద్దు, జీఎస్టీ ద్వారా దెబ్బతీశారని ధ్వజమెత్తారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే...సైన్యంలో అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేస్తామని రాహుల్ ప్రకటించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రక్రియను బైపాస్ చేసేందుకు చట్టాలు చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాకాగాంధీ ఆరోపించారు.

ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా వాటిని అమలు చేస్తోందన్నారు. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి బెన్నీ బెహనాన్‌కు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ప్రియాంక భాజపాపై విరుచుకుపడ్డారు. మహిళలపై అత్యాచారాలు చేసేవారికి అండగా నిలుస్తున్న మోదీ ప్రభుత్వం వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్నట్లు ప్రకటనలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. ఉపాధి అవకాశాలు లేక ప్రజలు పేదరికంలోకి జారుతుంటే పట్టించుకోని ప్రధాని మోదీ తనకు సన్నిహితులైన పారిశ్రామికవేత్తల ప్రయోజనాలు కాపాడేందుకు నిరంతరం పనిచేస్తున్నారని ప్రియాంక దుయ్యబట్టారు. తొలిదశ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని, ఇండియా కూటమిని తిరస్కరించారన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను ప్రియాంక తప్పుపట్టారు. ఫలితాలు రాకుండా ఆ విషయం ఎలా తెలిసిందని... నిలదీశారు.

Tags

Read MoreRead Less
Next Story