కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో భారత్ మరో ముందడుగు.. రెండోదశ ట్రయల్స్

కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో భారత్ మరో ముందడుగు.. రెండోదశ ట్రయల్స్
కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో భారత్ మరో ముందడుగు వేసింది. క్లినికల్‌ ట్రయల్స్‌లో రెండోదశకు..

కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో భారత్ మరో ముందడుగు వేసింది. క్లినికల్‌ ట్రయల్స్‌లో రెండోదశకు చేరుకుంది. కరోనా టీకాకు భారత్‌లో జరుగుతున్న ప్రయోగాల్ల భారత్‌ బయోటెక్‌తో కలిసి ఐసీఎంఆర్‌ అభివృద్ధి చేస్తున్న కోవ్యాక్సిన్‌ టీకా పరిశోధనలో మరో కీలక ఘట్టానికి చేరుతుంది. ఇప్పటికే మొదటి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతం కావడంతో.. ఫేజ్‌- 2 ప్రయోగానికి అనుమతి పొందింది. భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ అభివృద్ధి చేసిన కరోనా టీకా కొవాక్జిన్‌పై రెండో దశ ఫేజ్‌- 2 క్లినికల్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వంలోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్డ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీవో) అనుమతి ఇచ్చింది. ఈ పరీక్షలను 380 మంది వలంటీర్లపై నిర్వహించాలని సూచించింది. రెండు మూడు రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో రెండో దశ పరీక్షలు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story