PM Modi : 2040 నాటికి చంద్రుడిపైకి మనిషిని పంపాలి : శాస్త్రవేత్తలతో మోదీ

PM Modi : 2040 నాటికి చంద్రుడిపైకి మనిషిని పంపాలి : శాస్త్రవేత్తలతో మోదీ
గగన్ యాన్ మిషన్ పై మోదీ సమీక్ష.. 035 నాటికి అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న మోదీ

గగన్‌యాన్ మిషన్ మొదటి విమానానికి సంబంధించిన సన్నాహాలను సమీక్షించిన ప్రధాని మోదీ.. 2040 నాటికి చంద్రుడిపైకి మనిషిని పంపాలని, 2035 నాటికి అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు. వీనస్‌పై ఆర్బిటర్ మిషన్, మార్స్ ల్యాండర్ పై పని చేయాలని కూడా శాస్త్రవేత్తలను కోరారు.

గగన్‌యాన్ మిషన్ పురోగతిని అంచనా వేయడానికిస, భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాల భవిష్యత్తును వివరించడానికి ఏర్పాటుచేసిన ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధాన మంత్రి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. హ్యూమన్ రేటేడ్ ప్రయోగ వాహనాలతో పాటు 20 ప్రధాన పరీక్షల గురించి మోదీ, శాస్త్రవేత్తలతో చర్చించారు.

క్రూ ఏస్కేప్ సిస్టం టెస్ట్ వెహికల్ ప్రదర్శనను ఈ నెల 21న షెడ్యూల్ చేశారు. 2025లో గగన్ యాన్ ప్రయోగం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల నిర్వహించిన చంద్రయాన్, ఆదిత్య ఎల్ 1 భారత అంతరిక్ష కార్యక్రమాలు విజయవంతమైన నేథ్యంలో భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటుతో సహా ప్రతిష్టాత్మక లక్ష్యాలను పెట్టుకోవాలని ప్రధాని ఆదేశించారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు కావాలని ప్రధాని సూచించారు. 2040 నాటికి చంద్రుడిపైకి భారతీయుడిని పంపాలనే లక్ష్యాన్ని ప్రధాని మోదీ.. శాస్త్రవేత్తలకు సూచించారు.


Tags

Read MoreRead Less
Next Story