PM MODI: మణిపుర్‌లో శాంతి స్థాపిద్దాం రండి

PM MODI: మణిపుర్‌లో శాంతి స్థాపిద్దాం రండి
దేశం మీకు అండగా ఉంది.... మణిపుర్‌ వర్గాలకు ప్రధాని మోదీ పిలుపు.. ప్రతిపక్షాల వల్లే ఈశాన్య రాష్ట్రం మండుతోందని విమర్శ...

విభజన రాజకీయాలతో ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నిరంతరం మంటలు రేపిందని ప్రధాని మోదీ(Modi Speech ) విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాల్లో(violence in Manipur ) ఇష్టానుసారం ప్రభుత్వాలను మార్చడం, సీఎంలను మార్చడం అనేక సమస్యలను సృష్టించిందన్నారు. మహాత్మా గాంధీ ఫొటో పెట్టలేని పరిస్థితి, జాతీయగీతం పాడలేని పరిస్థితులు మణిపుర్‌‍( Manipur)లో ఉండేవన్న మోదీ(PM MODI).. అప్పుడు కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలే‍(congress govt) ఉన్నాయని గుర్తుచేశారు. మణిపుర్‌ తీవ్రవాదానికి కారణం ఎవరో కారకులు ఎవరో కాంగ్రెస్‌కు గుర్తులేదా అని ప్రశ్నించారు. మణిపుర్‌లో తీవ్రవాదం పరాకాష్టకు చేరినపుడు అక్కడ అధికారంలో ఉంది ఎవరన్న ప్రధాని ప్రతి అంశాన్ని రాజకీయాల కోసమే చూడరాదన్నారు. మణిపుర్‌లో తలెత్తిన సమస్య పరిష్కారానికి అంతా కలిసి కృషి చేద్దామని ప్రధాని పిలుపునిచ్చారు.


దేశాన్ని ఏకీకృతం చేయాల్సిన బాధ్యతను ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఏనాడూ తీసుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ చరిత్ర అంతా భారతమాతను చిన్నాభిన్నం చేయడంలోనే మునిగిపోయిందన్న ఆయన ఆ పార్టీ అరాచకాలు చెప్పుకుంటే అనేకమున్నాయన్నారు. భారతమాత పట్ల ప్రతిపక్ష సభ్యులు చేసిన వ్యాఖ్యలను ఖండించిన ప్రధాని భారతమాత మరణంపై వ్యాఖ్యలు చేయడమంటే దేశ వినాశనాన్ని కోరుకున్నట్లేనని అన్నారు. వందేమాతరాన్ని.. ముక్కలు ముక్కలుగా చేసినపుడు కాంగ్రెస్‌ ఉద్దేశాలు బయటపడ్డాయన్న మోదీ బుజ్జగింపు విధానాలతోనే దేశానికి ముప్పు తెచ్చిపెట్టారని ధ్వమెత్తారు. ప్రస్తుత అవిశ్వాస తీర్మానంతో ప్రతిపక్షాలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి సిద్ధమయిపోయాయని మోదీ అన్నారు. ప్రతిపక్షాలు తెచ్చిన అవిశ్వాస తీర్మానం దేవుడు తమకు ఇచ్చిన వరంగా అభివర్ణించారు.


దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు నాశనం అవుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని కానీ అవి లాభాల్లో నూతన రికార్డులు నెలకొల్పుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేసిన సంస్థలన్నీ అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు దేశానికి విపక్షాలు శాపాలు పెడుతున్నాయని, దేశం కూడా మరింత బలోపేతం అవుతుందని మోదీ అన్నారు

భారత్ అతి త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో 12వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ.. ఎన్డీఏ ప్రభుత్వ విధానాలు, ప్రణాళిక, కఠోర శ్రమ వల్ల ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించిందన్నారు..

Tags

Read MoreRead Less
Next Story