Ship hijack: హైజాకార్లకు చుక్కలు చూపించిన ఇండియన్ నేవీ

Ship hijack:  హైజాకార్లకు చుక్కలు చూపించిన ఇండియన్ నేవీ
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను హైజాక్ చేసిన సోమాలియా సముద్రపు దొంగలు

అరేబియా సముద్రంలో వాణిజ్యనౌకను హైజాక్‌ చేసిన సముద్రపు దొంగలకు భారత నౌకదళం చుక్కలు చూపించింది. డిస్ట్రెస్‌ కాల్‌ అందుకున్న వెంటనే...గస్తీ నిర్వహించే యుద్ధవిమానం, యుద్ధనౌకలను.... ఘటనాస్థలానికి తరలించింది. ఈ తెల్లవారుజామున వాణిజ్యనౌకను అడ్డుకున్నట్లు నౌకాదళం ప్రకటించింది. అంతర్జాతీయ భాగస్వాములు, స్నేహపూర్వక దేశాలతోపాటు వాణిజ్య నౌకల భద్రతకు కట్టుబడి ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.

మాల్టాకు చెందిన ఓ వాణిజ్య నౌక అరేబియా సముద్రంలో హైజాక్‌అయిన ఘటనను భారత నౌకదళం సమర్థంగా తిప్పికొట్టింది. సోమాలియా వెళ్తున్న MVరుయెన్‌ నౌకను కొందరు సముద్రపు దొంగలు హైజాక్‌ చేశారు. అందులో 18మంది సిబ్బంది ఉన్నారు. ఈ మేరకు వాణిజ్య నౌక నుంచి గురువారం డిస్ట్రెస్‌ కాల్‌ రావడంతో భారత నౌకాదళం అప్రమత్తమైంది. గల్ఫ్‌ ఆఫ్‌ అడెన్‌లో గస్తీ నిర్వహిస్తున్న యుద్ధ విమానం, యుద్ధనౌకలను...శుక్రవారం రంగంలోకి దించినట్లు నౌకాదళం తెలిపింది. ఈ తెల్లవారుజామున భారత యుద్ధనౌక...రుయెన్‌ వాణిజ్య నౌకను అడ్డగించినట్లు పేర్కొంది. ప్రస్తుతం హైజాక్‌ అయిన రుయెన్‌ నౌక సోమాలియాతీరం దిశగా ప్రయాణిస్తున్నట్లు ప్రకటించింది. దాని పైనుంచే నౌకాదళం యుద్ధవిమానం ప్రయాణిస్తున్నట్లు పేర్కొంది. ఆ ప్రాంతంలోని ఇతరసంస్థల సహకారంతో....పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు నౌకాదళం వెల్లడించింది.

వాణిజ్య నౌక హైజాక్‌ అయిన ఘటనపై ఈ రీజియన్‌ నుంచి తామే మొట్టమొదట స్పందించినట్లు భారత నౌకాదళం తెలిపింది. అంతర్జాతీయ భాగస్వాములు, స్నేహపూర్వక దేశాలతోపాటు వాణిజ్య నౌకల భద్రతకు కట్టుబడి ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. 2017 తర్వాత సోమాలియా సముద్రపు దొంగలు నౌకపై జరిపిన తొలి అతిపెద్ద దాడి ఇదే అని తెలుస్తోంది

Tags

Read MoreRead Less
Next Story