Bihar: లంచం కోసం నడిరోడ్డుపై చితకబాదుకున్న పోలీసులు

Bihar: లంచం కోసం నడిరోడ్డుపై చితకబాదుకున్న పోలీసులు
వైరల్ గా మారిన వీడియో

లంచం తీసుకున్న వారిని కటకటాల్లోకి నెట్టించే పని చేసే పోలీసులలో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. అవసరానికి సహాయం అందించడమనే ప్రభుత్వాల ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు. వారివల్ల సాధారణ పౌరులకు అభద్రతాభావం పెరిగిపోతోంది. తాజా సంఘటన లంచావతారం ఎత్తిన ఇద్దరు పోలీసులకు సంబంధించిందే..బీహార్‌లోని నలంద జిల్లాలో ఎమర్జెన్సీ సర్వీస్‌కు చెందిన ఇద్దరు పోలీసుల మధ్య దాదాపు అరగంట పాటు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇద్దరు చొక్కాలు పట్టుకుని ఒకరిని ఒకరు తోసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలన్నింటినీ స్థానికులు వీడియో తీశారు. గొడవ సమయంలో ఉన్నతాధికారులకు విషయం తెలిస్తే సస్పెండ్ చేస్తారని స్థానికులు వారించినా వారు వినకపోవడం ఎక్కడ చెప్పుకోవాల్సిన విషయం.


బిహార్ రాష్ట్రం నలంద జిల్లాలో ఇద్దరు పోలీసులు లంచం పంచుకునే విషయంలో గొడవకు దిగారు. నలందలోని ఓ రోడ్డుపై పోలీసులు బండి ఆపారు. అందులోంచి దిగిన ఓ పోలీస్ లంచం విషయమై మరో పోలీసుతో గొడవకు దిగాడు. మాట్లాడుతుండగా జీపులో ఎక్కడానికి వెళ్తున్న పోలీసును మరొకరు లాఠీతో కొట్టాడు. రహుయి పోలీస్ స్టేషన్ పరిధిలోని సోహ్సరాయ్ హాల్ట్ సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. వివాదం కారణంగా తీవ్ర స్థాయిలో బూతులు తిట్టుకుంటూ ఒకరినొకరు చితకబాదుకుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు పోలీసులు ఒకరినొకరు దుర్భాషలాడుకోవడం, దాడి చేసుకోవడం వీడియోలో చూడొచ్చు. ఈ దృశ్యాలన్నింటినీ స్థానికులు వీడియో తీశారు. గొడవ సమయంలో ఉన్నతాధికారులకు విషయం తెలిస్తే సస్పెండ్ చేస్తారని స్థానికులు వారించినా వారు వినలేదు. మొబైల్ లో రికార్డు చేసిన వీడియోను సోషల్ మీడియాలో ఉంచడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. వారిద్దరినీ సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. దీంతో వీడియోపై జిల్లా పోలీసు అధికారులు స్పందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ అశోక్ మిశ్రా తెలిపారు. గొడవకు కారణం స్పష్టంగా తెలియరాలేదని అధికార వర్గాలు చెప్తున్నప్పటికీ.. లంచం విషయంలోనే వివాదం ఏర్పడినట్లు స్థానికులు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story