Gaganyaan: గగన్‌యాన్ ప్రాజెక్టులో మహిళలకు ప్రాధాన్యం

Gaganyaan: గగన్‌యాన్ ప్రాజెక్టులో మహిళలకు ప్రాధాన్యం
ఇస్రో ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇప్పుడు ఉత్సాహంలో ఉంది. అంతరిక్షంలో పరిశోధనలు చేసేందుకు గాను ప్రతిష్టాత్మక మిషన్‌లు చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. . దక్షిణ ధ్రువంలో కాలు మోపడంతో,అద్భుతం సాధించిన తొలి దేశంగా భారత్ చరిత్రపుటలకెక్కింది. ఈ ప్రాజెక్ట్ చంద్రుని ఉపరితలంపై ప్రయోగాలు జరిపి, భూమికి ఎంతో కీలకమైన సమాచారాన్ని అందజేసింది. ఈ మిషన్ చేపట్టిన కొన్ని రోజులకే సూర్యుడ్ని అధ్యయనం చేసేందుకు ఆదిత్య-ఎల్1ని లాంచ్ చేసింది.

ఇక ఇప్పుడు ఇస్రో గగన్‌యాన్ ప్రాజెక్టు చేపట్టనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుపై ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టులో అధిక ప్రాధాన్యం మహిళలకు ఇచ్చే యోచనలో ఉన్నామని పేర్కొన్నారు. మహిళా టెస్టు ఫైలట్లు, మహిళా శాస్త్రవేత్తలను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తామని తెలిపారు. ఇక వచ్చే ఏడాది మానవ రహిత గగన్‌యాన్ స్పేస్ క్రాఫ్ట్‌లో ఫీమేల్ హ్యూమనాయిడ్‌ను పంపిస్తామని చెప్పారు. అయితే ఇది మనిషిని పోలి ఉండే రోబో. వాస్తవానికి గగన్‌యాన్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపిచి.. అక్కడ 3 రోజుల పాటు వారిని ఉంచి తీసుకురావడం. అయితే ఈ ప్రాజెక్టులో మహిళలకు చోటు ఇస్తామని.. అయితే అది సాధ్యం కావడానికి అందుకు తగ్గ అభ్యర్థులు దొరకాలని చెప్పారు సోమనాథ్.


అయితే ప్రస్తుతం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన వారిని ఫైటర్ టెస్ట్ అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నామని.. వాళ్లు వివిధ కేటగిరీల నుంచి ఉన్నారని తెలిపారు. అయితే ప్రస్తుతం మహిళా ఫైటర్ టెస్టు ఫైలట్లు అందుబాటులో లేరని.. వారు ముందుకు వచ్చినట్లైతే ఓ మార్గం సుగమం అవుతుందంటూ సోమనాథ్ తెలిపారు. అలాగే ఈ ప్రాజెక్టులో మహిళలను భాగం చేసేందుకు రెండో ఎంపిక శాస్త్రీయ కార్యకలాపాలతో ఉంటుందని.. అయితే ఈ ఎంపికలో శాస్త్రవేత్తలే వ్యోమగాములుగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పారు. దీనివల్ల మహిళలకు మరిన్ని అవకాశాలు వస్తాయని తాము నమ్ముతున్నామని పేర్కొన్నారు. ఇక 2035 నాటికి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించే భారతీయ స్పేస్ స్టేషన్‌ను అంతరిక్షంలో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సోమనాథ్ పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story