ISRO: మరో ప్రయోగానికి ఇస్రో సిద్దం

ISRO: మరో ప్రయోగానికి ఇస్రో సిద్దం
సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి సోమవారం ఉదయం 10గంటల 42నిమిషాలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 ప్రయోగం చేపట్టనున్నారు

మరో ప్రయోగానికి ఇస్రో సిద్దం అయ్యింది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి సోమవారం ఉదయం 10గంటల 42నిమిషాలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 ప్రయోగం చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఇవాళ ఉదయం 7గంటల 12నిమిషాలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. 27గంటల 30 నిమిషాల పాటు ఈ కౌంట్‌డౌన్ కొనసాగనుంది. సోమవారం ఉదయం 10గంటల 42నిమిషాలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 ప్రయోగం చేపట్టనున్న సందర్భంగా ఇస్రో అధిపతి డా. సోమనాథ్‌ సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఇస్రో నావిగేషన్‌ సేవల కోసం గతంలో పంపిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఉపగ్రహాల్లో నాలుగింటికి జీవితకాలం ముగిసిందని, వాటి స్థానంలో ప్రతి ఆరునెలలకు ఒక ఉపగ్రహాన్ని పంపేలా సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story