Italy PM : భర్తతో విడిపోతున్నట్టు ప్రకటించిన ఇటలీ ప్రధాని

Italy PM : భర్తతో విడిపోతున్నట్టు ప్రకటించిన ఇటలీ ప్రధాని
టీవీ షోలో అత్యాచారాలపై అభ్యంతరకర వ్యాఖ్యలే కారణం

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన భర్త ఆండ్రియా గియాంబ్రునోతో విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమె ప్రకటించారు. ఈ జంటకు ఏడేళ్ల కుమార్తె ఉంది.పదేళ్ల తమ బంధం ముగిసిపోయిందని సోషల్ మీడియా వేదికగా ఆమె తెలిపారు. కొంత కాలంగా తాము ప్రయాణిస్తున్న దారులు మారాయని చెప్పారు. సరైన నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమయిందని అన్నారు.ఈ జంటకు ఏడేళ్ల కుమార్తె ఉంది.

భర్తతో మెలోని విడాకులు తీసుకోవడానికి కొన్ని నెలల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలే కారణం. ఇటలీకి చెందిన ప్రముఖ టీవీ ఛానెల్‌ రెటా 4aలో ఆండ్రియా గియాంబ్రూనో వ్యాఖ్యాతగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టులో టెలీకాస్ట్ అయిన డయారియో డెల్ మహిళలు సరదాగా గడిపేందుకు వెళ్లినప్పుడు తాగుతారని, అత్యాచారాలను నివారించాలంటే మహిళలు స్పృహ కోల్పోకుండా ఉండాలని చెప్పారు. ఆ ఎపిసోడ్ తర్వాత ఆండ్రియా చేసిన వ్యాఖ్యలకు తనను విమర్శించవ‌ద్ద‌ని అలాగే, అతని ప్రవర్తన గురించిన అడిగే ప్రశ్నలకు తాను జవాబు చెప్పబోనని అన్నారు.


దీనిపై ఆయన వివరణ ఇస్తూ మద్యం కోసం, డ్రగ్స్ కోసం బయటకు వెళ్లొద్దని చెప్పడమే తన ఉద్దేశమని చెప్పారు. చెడు వ్యక్తుల నుంచి తప్పించుకునేందుకు జాగ్రత్తగా ఉండాలనే తాను చెప్పానని అన్నారు. మరోవైపు మహిళా ఉద్యోగులను ఉద్దేశించి ఇటీవల ఆయన చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యల రికార్డింగ్ లు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తన భర్తతో విడిపోతున్నట్టు ఇటలీ ప్రధాని తెలిపారు. తనకంటే వయసులో నాలుగేళ్ల చిన్నవాడైన ఆండ్రియాను మెలోనీ మొదటిసారిగా టీవీ షోలోనే కలిశారు. ఆ పరిచయం స్నేహంగా మారి.. ఒకరినొకరు ఇష్టపడి సహజీవనం సాగిస్తున్నారు.

ఇక, రోమ్‌కు చెందిన ఓ కార్మిక కుటుంబంలో జన్మించిన మెలోనీ.. కేవలం 15 ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చారు. ఇటాలియన్ సోషల్ మూవ్‌మెంట్ (ఎంఎస్ఐ) యూత్ వింగ్‌లో చేరారు. క్రమంగా పార్టీలో ఎదుగుతూ తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది సెప్టెంబరు చివరిలో జరిగిన ఎన్నికల్లో ఆమె నేతృత్వంలోని కూటమి 43 శాతానికి పైగా ఓట్లను సాధించి అధికారంలోకి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీలో ఏర్పడిన పూర్తి అతివాద ప్రభుత్వం ఇదే ‘గాడ్‌ ఫాదర్‌ల్యాండ్‌ ఆఫ్‌ ఫ్యామిలీ’ అనే వివాదాస్పద నినాదంతో ప్రజలను ఆకర్షించారు. గత ఎన్నికల్లో మెలోని పార్టీ కేవలం నాలుగు శాతం ఓట్లు మాత్రమే సాధించింది.

Tags

Read MoreRead Less
Next Story