నేడే పూరీ రధయాత్ర

నేడే పూరీ రధయాత్ర
మధ్యాహ్నం 3 గంటలకు కదలనున్న జగన్నాధుడు

మూల విరాట్టులే ఆలయం నుంచి కదిలి వచ్చి భక్తజనుల సమక్షంలో ప్రత్యేకమందిరానికి వెళ్లే పండుగే రధాయాత్ర. ప్రతీ ఏడూ ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం రెండో రోజున ఈ యాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి పది రోజుల తర్వాత దశమినాడు మారు రధాయాత్ర. తరువాత ఏకాదశి నాడు విగ్రహాలకు అద్భుతమైన బంగారు ఆభరణాల అలంకారంతో ముగిసే ఈ యాత్రకు దేశం నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తారు.

పురుషోత్తమ క్షేత్రంగా విలసిల్లే పూరిలో జగన్నాథ రథయాత్ర ఇవాళ ప్రారంభమవుతోంది. ఇతర ఆలయంలో ఉన్నట్టుగా స్వామి తన దేవరులతో కాకుండా సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కొలువై ఉండే విశిష్ట ఆలయం పూరి. ఏటా జరిగే రథయాత్రలో స్వామి, సోదర,సోదరిలతో గుండిచాకు వెళతారు. పురాణాల ప్రకారం గుండిచా యజ్ఞస్థలం కాగా, ఇప్పుడు గుండిచా ఆలయాన్ని జగన్నాథుని అత్తవారి ఇల్లుగా భావిస్తున్నారు. జ్యేష్ఠ పౌర్ణమినాడు పుణ్య జలాలతో దేవతామూర్తులకు సుదీర్ఘ అభిషేకం చేస్తారు. తరువాత రెండు రోజులపాటు వారికి కందమూలాలు మాత్రమే నివేదన పెడతారు. తర్వాత పౌర్ణమి నాడు నేత్రోత్సవం జరిపి విగ్రహాలకు కొత్త రంగులు వేసి అలంకరిస్తారు. ఇక స్వామివారి రథయాత్రకు ఉపయోగించే రథాలను ప్రతి సంవత్సరం కొత్తగా తయారు చేస్తారు. జగన్నాథుడు ఊరేగే రథాన్ని నందిఘోష్ అంటారు. గరుడ ధ్వజ, కపిల ధ్వజాలు రెపరెపలాడే రథమిది ఈ రథానికి సంరక్షకుడు గరుత్మంతుడు కాగా సారథి దారుకుడు. ఇక బలభద్రుని రథం పేరు తాళ్ల ధ్వజము దీని సారథి మాతలి. అలాగే సుభద్ర అదే విరదానికి దర్పదళన నామం. రథ సంరక్షణకురాలు జయ దుర్గ కాగా సారధి అర్జునుడు.

ఈరోజు ఈ మూడు రకాలు అపార జన సందోహపు సందడితో ప్రధాన మార్గం నుంచి బోడోదండో అనే విశాల మార్గం ద్వారా గుండిచాకు చేరుకుంటాయి. సుమారు తొమ్మిది గంటల సమయంలో విగ్రహాలను రథాలపై ప్రతిష్ఠించి మంగళహారతి చేపట్టారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్ దేవ్ రథాలపై చెరాపహర అంటే బంగారు చీపురుతో ఊడ్చడం చేస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు భక్తులు రథాలను లాగడం ప్రారంభమవుతుంది. సాయంత్రం రథాలు గుండిచా మందిరానికి చేరుకునే ఏర్పాట్లు చేశారు. ఈసారి సుమారు పది లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అనువుగా ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది.

Tags

Read MoreRead Less
Next Story