Chandrayan-3: ల్యాండింగ్ సందర్భంగా సైకత శిల్పం

Chandrayan-3: ల్యాండింగ్ సందర్భంగా  సైకత శిల్పం
జయహో ఇస్రో సైకత శిల్పాన్ని రూపొందించిన సుదర్శన్ పట్నాయక్

చంద్రయాన్ బుధవారం సాయంత్రం చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ అవడానికి సిద్ధంగా ఉంది. దేశం మొత్తం ఎంతో ఆసక్తితో ఈ మిషన్ కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ సైకత శిల్పకారుడు సుదర్శన్ పట్నాయక్ బృందం అద్భుతమైన కళాకృతితో చంద్రయాన్ -3 మిషన్ శుభాకాంక్షలు తెలియజేసింది. చంద్రయాన్ -3 ల్యాండింగ్ సందర్భంగా ఒడిశా సముద్ర తీరంలో జయహో ఇస్రో అంటూ సైకత శిల్పాన్ని రూపొందించారు. ఆల్ ద బెస్ట్ అంటూ ఇస్రో శాస్త్రవేత్తలకు సుదర్శన్ పట్నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. పట్నాయక్ తన సైకత శిల్పంలో చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధృవం మీద భారత జెండాను ఉంచి విజయవంతంగా ల్యాండింగ్ చేస్తున్నట్లు చూపించారు. చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర టచ్ డౌన్ చేయడానికి షెడ్యూల్ చేశారు.


ఇంతకు నెల ముందు కూడా ప్రఖ్యాత సాండ్ ఆర్టిస్ట్ పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ చంద్రయాన్ 3 ప్రయోగానికి ముందు 22 అడుగుల పొడవైన సైకత శిల్పాన్ని తయారు చేశారు. ఇందులో 15 టన్నుల ఇసుకను వినియోగించారు. పాఠశాల విద్యార్థులతో కలిసి అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించారు.


అంతకు ముందు కూడా భారతదేశం యొక్క రెండవ చంద్ర అన్వేషణ మిషన్ చంద్రయాన్-2 చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించడంతో అంతరిక్ష సంస్థ సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ, ప్రముఖ ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ బీచ్‌లో సాండ్ ఆర్ట్ ను రూపొందించారు. అయితే అనూహ్య కారణాల వల్ల చంద్రయాన్ 2 ఫెయిల్ అయిన విషయం తెలిసిందే.



Tags

Read MoreRead Less
Next Story