Bilkis Bano: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Bilkis Bano: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
దోషుల ముందస్తు విడుదలపై గుజరాత్ నిర్ణయం కొట్టివేత..

సుప్రీంకోర్టు గుజ‌రాత్ స‌ర్కార్‌కు షాకిచ్చింది. బిల్కిస్ బానో కేసులో అత్యున్న‌త న్యాయ‌స్థానం సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది. ఆ కేసులో 11 మంది రేపిస్టుల‌ను ముంద‌స్తుగా రిలీజ్ చేయాల‌న్ని సుప్రీంకోర్టు త‌ప్పుప‌ట్టింది. గుజ‌రాత్ స‌ర్కార్ ఇచ్చిన క్ష‌మాభిక్ష‌ను కోర్టు ర‌ద్దు చేసింది. గుజ‌రాత్ ప్ర‌భుత్వానికి ఆ అధికారం లేద‌ని ఇవాళ సుప్రీం ధ‌ర్మాస‌నం పేర్కొన్న‌ది. జ‌స్టిస్ బీవీ నాగ‌ర్న‌త‌, ఉజ్వ‌ల్ భూయాన్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసులో ఇవాళ తీర్పును వెలువ‌రించింది. 11 మంది అత్యాచార నిందితుల రిలీజ్‌ను స‌వాల్ చేస్తూ బిల్కిస్ బానో వేసిన పిటీష‌న్‌కు అర్హ‌త ఉంద‌ని ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది. రేప్ నిందితుల‌కు క్ష‌మాభిక్ష పెట్టే అర్హ‌త గుజ‌రాత్ ప్ర‌భుత్వానికి లేద‌ని, ఆ కేసులో అటువంటి ఆదేశాలు ఇచ్చే అధికారం మ‌హారాష్ట్ర స‌ర్కారుకు ఉంద‌ని, ఎందుకంటే అక్కడే ఆ కేసులో విచార‌ణ జ‌రిగింద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది


2002 లో జరిగిన గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. బానో ఇంట్లోకి చొరబడిన పలువురు దుండగులు ఆమెపై అత్యాచారం చేసి, మూడేళ్ల కూతురితో పాటు ఇంట్లో అందరినీ దారుణంగా చంపేశారు. ఆ సమయంలో ఆమె అయిదు నెలల గర్భిణి. ఈ దారుణంపై బిల్కిస్ బానో సుదీర్ఘంగా న్యాయపోరాటం చేశారు. నిందితుల అరెస్టు మొదలుకొని వారికి శిక్ష పడేంత వరకూ పోరాడారు. నేరం రుజువు కావడంతో నిందితులకు కోర్టు మరణ శిక్ష విధించింది. అయితే దీనిపై నిందితులు అప్పీల్ చేసుకోవడంతో యావజ్జీవ శిక్షకు మార్చింది. అయితే, ఈ కేసులో మొత్తం పదకొండు మంది దోషులను గతేడాది గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేసింది. 1992 చట్టం ప్రకారం.. వీరు 14 ఏళ్లు శిక్ష పూర్తి చేసుకోవడంతో పాటు జైలులో సత్ర్పవర్తనతో మెలిగారని మెచ్చుకుని స్వాతంత్ర దినోత్సవం రోజు బయటకు పంపింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. అత్యంత దారుణకాండకు పాల్పడిన వారిని స్వేచ్ఛాయుత సమాజంలో విడిచి పెట్టడాన్ని స్వాగతించట్లేదంటూ పలువురు ప్రముఖులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు బాధితురాలు మరోమారు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపధ్యంలో గతేడాది అక్టోబర్ లో తీర్పును రిజర్వ్ చేశారు. ఇవాళ విచార‌ణ స‌మ‌యంలో జ‌స్టిస్ నాగ‌ర‌త్న .. గుజ‌రాత్ ప్ర‌భుత్వం వైఖ‌రిని త‌ప్పుప‌ట్టారు. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ అధికారాల‌ను గుజ‌రాత్ అప‌హ‌రించిన‌ట్లు ఆమె తీర్పులో పేర్కొన్నారు. దీంతో త్వరలోనే వారు పోలీసులు లేదా న్యాయస్థానం ముందు సరెండర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.



Tags

Read MoreRead Less
Next Story