Jamili elections: జమిలీ ఎన్నికలు.. తేల్చేసిన కేంద్రం

Jamili elections: జమిలీ ఎన్నికలు.. తేల్చేసిన కేంద్రం
లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై కేంద్రం స్పష్టత

దేశంలో లోక్‌సభ, అసెంబ్లీలకు కలిపి ఒకేసారి ఎన్నికలు(Jamili elections) సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. లోక్ సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపే అంశంపై సాధ్యాసాధ్యాలను లా కమిషన్ పరిశీలిస్తోందనికేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి అర్జున్‌రాం మేఘ్‌వాల్‌(Arjunram Meghwal) వెల్లడించారు. లోక్‌సభ (Lok Sabha), రాష్ట్రాల అసెంబ్లీ(Assembly)లకు జమిలి ఎన్నికలు(Jamili Elections) నిర్వహించేందుకు ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నాయని తెలిపారు. జమిలి ఎన్నికలపై లా కమిషన్ ఆచరణాత్మక రోడ్‌ మ్యాప్, ఫ్రేమ్ వర్క్‌ను తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.

జమిలి ఎన్నికల(Jamili Elections) నిర్వహణకు అయిదు ప్రధాన అడ్డంకులు( FIVE BARRIROS) ఉన్నట్లు వెల్లడించింది. రాజ్యసభ(Rajya Sabha) లో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌(Arjunram Meghwal) బదులిచ్చారు. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలో అయిదు అధికరణలను సవరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ఈ ఎన్నికల వల్ల ప్రజాధనం ఆదాతో పాటు పలు ప్రయోజనాలున్నాయని కూడా కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి తెలిపారు.


జమిలీ ఎన్నికల(Jamili Elections)వల్ల పదేపదే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉండదని, పరిపాలన, శాంతిభద్రతల నిర్వహణ యంత్రాంగం ఒకే పనిని వెంట వెంటనే చేయాల్సిరావడం తప్పుతుందని కేంద్రం తెలిపింది. ఎన్నికల ప్రచారంలోనూ రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు పెద్ద మొత్తం ధనం ఆదా అవుతుందని, రెండు ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడంవల్ల ఎన్నికల ప్రవర్తనా నియమావళి దీర్ఘ కాలం అమలుచేసే పరిస్థితి ఉండదు కాబట్టి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రతికూల ప్రభావం తగ్గుతుందని అర్జున్‌ రామ్ మేఘ్‌వాల్‌ తెలిపారు.


జమిలీ ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలో కనీసం అయిదు అధికరణలకు సవరణ చేయాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. పార్లమెంటు కాలపరిమితికి సంబంధించిన అధికరణం 83, లోక్‌సభను రద్దు చేసేందుకు రాష్ట్రపతికి అధికారాలు కల్పించే అధికరణం 85, రాష్ట్ర శాసనసభల కాలపరిమితిని నిర్దారించే అధికరణం 172, రాష్ట్ర అసెంబ్లీల రద్దు కోసం అధికరణం 174, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు ఉద్దేశించిన అధికరణం 356ను సవరించాల్సి ఉంటుందని వెల్లడించింది.


దేశంలో, రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించాల్సి వస్తుందని, జమిలీ ఎన్నికలకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి తప్పక అంగీకారం తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. జమిలి ఎన్నికలకు అదనపు ఈవీఎంలు, వీవీప్యాట్‌లు సేకరించాల్సి వస్తుందని, ఇందుకోసం వేల కోట్ల రూపాయలు, అదనపు పోలింగ్‌ సిబ్బంది, భద్రతా బలగాలు అవసరం అవుతాయని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story