Jharkhand: రాజ్యాంగ సంక్షోభం దిశగా జార్ఖండ్ ప్రభుత్వం.. సీఎంపై అనర్హత వేటు..

Jharkhand: రాజ్యాంగ సంక్షోభం దిశగా జార్ఖండ్ ప్రభుత్వం.. సీఎంపై అనర్హత వేటు..
Jharkhand: రాజ్యాంగ సంక్షోభం దిశగా జార్ఖండ్ ప్రభుత్వం వెళ్తోంది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు పడింది.

Jharkhand: రాజ్యాంగ సంక్షోభం దిశగా జార్ఖండ్ ప్రభుత్వం వెళ్తోంది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు పడింది. ఈసీ సిఫార్సుతో సోరెన్ శాసనసభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేశారు. తనకు తానే మైనింగ్ కేటాయించుకున్నారని సోరెన్‌పై ఆరోపణలు ఉన్నాయి. సోరెన్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు కావడంతో జార్ఖండ్ తదుపరి సీఎం ఎవరు? అనేది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలతో సోరెన్ చర్చలు జరిపారు.

కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ సర్కారును జేఏఏం ఏర్పాటు చేయగా.. ఇపుడు ఎమ్మెల్యే సభ్యత్వం రద్దుతో సోరెన్ ఉపఎన్నికలకు వెళ్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే సోరెన్ ఎన్నికలకు వెళ్లకపోవచ్చని.. జార్ఖండ్ సీఎం రేసులో సోరెన్ భార్య? ఉన్నారని జేఏఏం వర్గాలు అంటున్నాయి. గతంలో గనుల కేటాయింపులపై సీఎం హేమంత్‌ సోరెన్‌పై జార్ఖండ్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. నిబంధనలకు విరుద్ధంగా అంగద రాంచీలో రాయి క్వారీ గనులను కేటాయించారని బీజేపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 9ఏ ప్రకారం సోరెన్ నిబంధనలను ఉల్లంఘించారని.. సీఎంగా అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత బీజేపీ నాయకులు అందించిన వినతిపత్రాన్ని గవర్నర్ రమేష్.. ఎన్నికల సంఘానికి పంపించారు. ఇక సోరెన్‌కు షాక్ ఇస్తూ ఈసీ.. ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్‌ను కోరింది. ఈసీ సిఫార్సుతో సోరెన్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story