Reliance : వినాయక చవితికి జియో ఎయిర్ ఫైబర్..!

Reliance : వినాయక చవితికి జియో ఎయిర్ ఫైబర్..!
రిల‌య‌న్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా.. ఇషా, ఆకాశ్‌, అనంత్ ఇన్‌..

రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సాధారణ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన సంస్థ అధిపతి ముకేశ్‌ అంబానీ జియో ఎయిర్‌ ఫైబర్, జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు సంబంధించి... కీలక ప్రకటనలు చేశారు. దేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ గత పదేళ్లలో 150 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. మరే భారత కార్పొరేట్ సంస్థ కూడా ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టలేదన్నారు.భారత్ ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతోందన్న ముకేశ్ అంబానీ... 4జీ వినియోగదారులంతా 5జీకి వెళ్లేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. జియో వినియోగదారుల సంఖ్య 45 కోట్లు దాటిందన్న ఆయన జియో 5జీ నెట్ వర్క్ ను డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు.


ఇప్పటికే 96 శాతం పట్టణాల్లో జియో 5జీ సేవలు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. డిసెంబర్ నుంచి జియో 5జీ బ్రాడ్ బ్యాండ్ ను అందుబాటులోకి తెస్తున్నట్లు ముకేశ్ తెలిపారు.కృత్రిమమేధ సాంకేతికతను జియోలో పెద్దఎత్తున ఉపయోగిస్తామని ప్రజలందరికీ అందుబాటులోకి తెస్తామన్నారు. ఇదేసమయంలో జియో ఎయిర్ ఫైబర్ ను సెప్టెంబర్‌ 19న ప్రారంభిస్తామని ప్రకటించారు.


మరోవైపు సంస్థ బోర్డులోకి ముకేశ్ అంబానీ వారసులు ఇషా, ఆకాష్, అనంత్ ప్రవేశించారు. ఈ ముగ్గురు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు.ఇదే సమయంలో రిలయెన్స్ డైరెక్టర్ బాధ్యతల నుంచి ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ తప్పుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story