Top

నా స్థానంలో మీ కూతురు ఉంటే ఇలాగే మాట్లాడేవారా? : కంగనా

హీరో సుశాంత్‌సింగ్‌ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్స్‌ అంశం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం పార్లమెంట్ సమావేశాలలోనూ హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వాడకం..

నా స్థానంలో మీ కూతురు ఉంటే ఇలాగే మాట్లాడేవారా? : కంగనా
X

హీరో సుశాంత్‌సింగ్‌ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్స్‌ అంశం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం పార్లమెంట్ సమావేశాలలోనూ హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వాడకం విపరీతంగా పెరిగిపోయిందంటూ... బీజేపీ ఎంపీ... రవికిషన్‌ చేసిన వ్యాఖ్యలను సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ తప్పుబట్టారు. డ్రగ్స్ విషయంలో సినీ పరిశ్రమపై నిందలు వేస్తున్నారని, చాలా మంది సొంత పరిశ్రమకే ద్రోహం చేస్తున్నారని, ఎవరో కొందరు అలా ఉంటే, మొత్తం సినీ పరిశ్రమను నిందించటం మంచిది కాదని ఆమె వ్యాఖ్యలు చేశారు. జయా బచ్చన్ వేసిన కౌంటర్‌ను రవి కిషన్ మళ్లీ తిప్పికొట్టాడు. పరిశ్రమలో ఎవరి సపోర్టు లేకుండా స్వయం కృషితో తాను పైకి వస్తే ప్రస్తుతం పరిశ్రమలో పూర్తిగా తుడిచిపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

జయా బచ్చన్‌పై ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా స్థానంలో మీ కూతురు శ్వేత, సుశాంత్ సింగ్ స్థానంలో మీ కుమారుడు అభిషేక్ బచ్చన్ ఉంటే మీరు ఇలాగే మాట్లాడేవారా అంటూ ప్రశ్నించారు. మీ కూతురు శ్వేత టీనేజ్‌లో నాలా బాలీవుడ్లో దెబ్బలు తిని, లైంగిక వేధింపులకు గురైతే మీరు ఇలానే మాట్లాడతారా ? సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌లా మీ కుమారుడు అభిషేక్ బచ్చన్ వేధింపుల గురించి ఫిర్యాదు చేసి, చివరకు ఆత్మహత్య చేసుకుంటే మీరు ఇలానే వ్యాఖ్యలు చేస్తారా? మాపై కూడా కాస్త దయ చూపండి అంటూ కంగనారనౌత్ జయా బచ్చన్ వ్యాఖ్యలపై తన స్పందనను తెలియజేశారు.

మరోవైపు మంత్రి ఆదిత్య థాకరేపై కంగనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆదిత్య పేరును ప్రస్తావించకుండా బేబీ పెంగ్విన్‌ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పలువురు బాలీవుడ్‌ నటులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని, అందుకే సుశాంత్‌ హంతకులను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. దీంతో ఆదిత్యపై సోషల్‌ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇందుకు స్పందనగా నటులతో స్నేహం చేయడం నేరం కాదని, అనవసరంగా తనను వివాదంలోకి లాగవద్దంటూ ఆదిత్య ట్వీట్‌ చేశారు.

Next Story

RELATED STORIES