Breaking : కపిల్‌దేవ్‌కు గుండెపోటు

X
భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ గుండెపోటుకు గురయ్యారు.. దీంతో ఆయనను ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. ఆయనకు ప్రస్తుతం యాంజియోప్లాస్టీ శస్త్రచికిత్స చేస్తున్నట్టు చెబుతున్నారు. కపిల్ కొంతకాలంగా డయాబెటిస్ సంబంధిత ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కపిల్ త్వరగా కోలుకోవాలని సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖలు ట్వీట్ చేస్తున్నారు. కాగా అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకరైన కపిల్ దేవ్.. 1983 లో భారత్ మొదటి ప్రపంచ కప్ సాధించడంలో కీలక పాత్ర వహించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
