Kedaranath : ఆకస్మిక వరదలు, నలుగురు మృతి

Kedaranath : ఆకస్మిక వరదలు, నలుగురు మృతి
విరిగిపడుతున్న కొండచరియలు 17 మంది గల్లంతు

ఉత్త‌రాఖండ్‌లో కేదార్‌నాథ్ స‌మీపంలోని గౌరీకుండ్ వ‌ద్ద కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. రుద్ర‌ప్ర‌యాగ్ జిల్లాలోని కేదార్‌నాథ్‌కు 16 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న గౌరికుండ్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న‌లో నలుగురు మృతిచెందారు. 17 మంది గ‌ల్లంతు అయ్యారు. రోడ్డు ప‌క్క‌న ఉన్న షాపులు, దాబాలపై రాళ్లు ప‌డ్డాయి. దీంతో ఆ షాపుల్లో ఉన్న వారు మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం గౌరీకుండ్ వ‌ద్ద రెస్క్యూ ఆప‌రేష‌న్ చేప‌డుతున్నారు. భారీ స్థాయిలో రాళ్లు, మ‌ట్టిపెల్ల‌లు ప‌డ‌డంతో.. రోడ్‌సైడ్ ఉన్న షాపులు, దాబాలు కొట్టుకుపోయాయి. అయితే ఆ షాపులు, దాబాల్లో న‌లుగురు స్థానికుల‌తో పాటు 16 మంది నేపాలీలు ఉన్న‌ట్లు భావిస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్ ద‌ళాలు సెర్చ్ ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టిన‌ట్లు జిల్లా అధికారులు వెల్ల‌డించారు. ఉత్తరకాశీలో కూడా కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న సరిహద్దు జిల్లాలో కూడా అరాకోట్-చిన్వా మార్గంలో ఉన్న మోల్దీ దగ్గర భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ మార్గంలో వెళ్తున్న ప్రయాణికులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. స్థానిక గ్రామస్తులతో సంబంధాలు తెగిపోయాయి.


ఉత్తర భారతంలో నాలుగు వారాల నుంచి కురుస్తోన్న వర్షాలతో జనజీవనం అతలా కుతలమైంది. అనేక రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్, హిమాచల్‌లో వంతెనలు, ఇళ్లు కూలిపోయాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటి వరకూ 199 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర సీజన్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక రూపంలో ప్రకృతి ఆటంకం కలిగిస్తోంది

Tags

Read MoreRead Less
Next Story