Kerala crime : మర్డర్ చేయడం కోసం నర్సుగా మారిన మహిళ

Kerala crime : మర్డర్ చేయడం కోసం నర్సుగా మారిన మహిళ
బెడిసికొట్టిన స్నేహితుడి భార్య హత్య ప్లాన్

కారణం తెలియదు కానీ ఓ మహిళ ఆస్పత్రిలో ఉన్న స్నేహితుడి భార్యనే హత్య చేయాలనుకుంది. అందుకోసం నర్సులా రెడీ అయింది ఇంజక్షన్ చేసి చంపేయడం కోసం ప్లాన్ సిద్ధం చేసుకుంది. కానీ ఇంజక్షన్ చేసేందుకు ఆమె భయపడటం కనిపెట్టిన బాధితురాలు అనుమానంతో యాజమాన్యానికి సమాచారం అందించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేరళలలో జరిగిన ఓ సంఘటన సినిమాను మించిపోయింది. గర్భవతి కావడంతో పరుమాల ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది బాధితురాలు స్నేహ. అన భర్త విదేశాలలో ఉన్నారు. డెలివరీ తర్వాత స్నేహ చికిత్స తీసుకుంటోంది.


ఇక నిందితురాలి పేరు అనూష. ఆమె, స్నేహ ఆసుపత్రిలో ఉన్న విషయం తెలుసుకొని ఒక వ్యూహాన్ని పన్నింది. నర్సు వేషంలో వెళ్లి స్నేహను చంపేయాలనుకుంది. శుక్రవారం నర్స్‌గా మారువేషంలో స్నేహ గదిలోకి ప్రవేశించిన నిందితురాలు ఇంజక్షన్‌ వేయాలని చెప్పి ఒక ఖాళీ సిరంజిని ఉపయోగించి బాధితురాలి సిరలలోకి గాలిని రెండుసార్లు ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నించింది, కానీ ఆ పనిచేస్తున్నప్పుడు ఆమె కాస్త భయపడినట్టుగాను, అనుమానాస్పదంగాను కనిపించడంతో స్నేహ తల్లికి అనుమానం వచ్చి నర్సింగ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆసుపత్రి అధికారులు నిందితురాలిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనూషను అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

అనూష సోదరి, స్నేహ భర్త క్లాస్‌మేట్స్. అయితే అనూష ఎటువంటి పనిచేయడానికి కారణం ఏంటి అనేది తెలియ రాలేదు.

Tags

Read MoreRead Less
Next Story