Khalistani : భారత్‌కు ఉగ్రవాది పన్నూన్ సంచలన హెచ్చరిక

Khalistani : భారత్‌కు ఉగ్రవాది పన్నూన్ సంచలన హెచ్చరిక
భారతదేశంపై హమాస్ తరహా దాడి చేస్తామని

ఖలిస్థానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ భారతదేశానికి సంచలన హెచ్చరిక జారీ చేశారు. ఇజ్రాయెల్ దేశంపై హమాస్ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారతదేశంపై తాము హమాస్ తరహా దాడి చేస్తామని బెదిరించారు. నిషేధిత యూఎస్ ఆధారిత సిక్కుల జస్టిస్ సంస్థ చీఫ్ అయిన ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తాజాగా కొత్త వీడియోను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. పంజాబ్ విషయంలో భారత్ తీరు ఇలాగే కొనసాగితే దీనికి హమాస్ దాడి లాంటి ప్రతిస్పందన ఉంటుందని పన్నూన్ హెచ్చరించారు.

సిక్కుల దాడులకు ప్రధాని మోదీ బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన ఈ వీడియోలో పేర్కొన్నారు. సిక్కుల జస్టిస్ సంస్థ ఓటును విశ్వసిస్తుందని పన్నూన్ వీడియోలో చెప్పారు. అలాగే గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ పై దాడి చేస్తామని పన్నూన్ బెదిరించడంతో ఆయనపై అహ్మదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్టోబర్ 5న గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వరల్డ్ కప్ తొలిమ్యాచ్ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్‌పాకిస్థాన్ మ్యాచ్ సహా పలు మ్యాచ్‌లు ఇక్కడ జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఇక్కడ ప్రతికూల వాతావరణాన్ని సృష్టించడానికి నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్‌ఎఫ్‌జె) సంస్థ వ్యవస్థాపకుడు, ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ ప్రయత్నిస్తున్నట్లు వెల్లడయింది. ఇటీవల హత్యకు గురయిన నిజ్జర్‌కు ప్రతీకారంగా కెనడానుంచి కొందరు ఖలిస్థానీ వాదులు భారత్‌కు చేరుకున్నారని అతను చెప్పడం గమనార్హం.


ఇందుకు సంబంధించి గురుపత్వంత్ సింగ్ మాట్లాడినట్లుగాఉన్న ప్రీ రికార్డింగ్ ఆడియో కాల్ గురువారం దేశ వ్యాప్తంగా ఎంతోమందికి వచ్చింది. నిజ్జర్ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఖలిస్థానీ జెండాతో అహ్మదాబాద్‌పై దాడి చేస్తామని ఆ మెస్సేజిల్లో ఉంది. ఈ విషయాన్ని పలువురు గుజరాత్ వ్యక్తులు పోలీసులకు తెలియజేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గురుపత్వంత్ సింగ్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అమృత్‌సర్‌లో జన్మించిన పన్నూన్ 2019వ సంవత్సరం నుంచి ఖలిస్తానీ ఉగ్రవాదిగా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ఇతనిపై మొదటి కేసు పెట్టినప్పటి నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ నిఘా వేసింది. పన్నూన్ పై 2021 వ సంవత్సరం ఫిబ్రవరి 3వతేదీన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. గత ఏడాది నవంబర్ 29వతేదీన అతన్ని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ప్రకటించింది.


Tags

Read MoreRead Less
Next Story