Knife In Stomach: కడుపు నొప్పితో వెళితే కత్తి బయటపడింది

Knife In Stomach:  కడుపు నొప్పితో వెళితే కత్తి బయటపడింది
ఎక్స్ - రేలో చూసి షాక్ అయిన వైద్యులు..

కడుపు నొప్పి వచ్చిందని ఆస్పత్రికి వెళ్లిన ఓ వ్యక్తికి మందులు ఇచ్చారు డాక్టర్లు. ఫలితం లేదు.. పొట్టను పరిశీలించగా చిన్న దెబ్బ తగిలింది అందుకే నొప్పి అని చెప్పాడు.అయితే సమస్య ఏమిటో తేలక ఎక్స్ రే తీయడంతో అసలు విషయం బయట పడింది. ఆ యువకుడి కడుపులో 15 సెంటీ మీటర్ల పొడవైన కత్తి ఉండటాన్ని చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. ఏం జరిగిందని ఆ యువకుడిని ప్రశ్నించగా.. అసలు విషయం బయట పెట్టాడు. అయితే కడుపులో కత్తి ఉన్నా ఆ యువకుడి శరీరంలోని అవయవాలేవీ దెబ్బతినకపోవడం విశేషం. ఈ ఘటన నేపాల్‌లో జరిగింది.

22 ఏళ్ల వయసు ఉన్న ఓ యువకుడు కడుపు నొప్పితో అంటూ ఆస్పత్రికి వెళ్లాడు. అయితే కడుపు నొప్పి తప్ప అతడికి వికారం, వాంతులు, విరేచనాలు ఇలా ఎలాంటి లక్షణాలు లేకపోవడంతోఅన్ని చెక్ చేసిన వైద్యులు నార్మల్‌‌గానే ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ వ్యక్తిని పూర్తిగా పరిశీలించిన వైద్యులు కడుపు కుడి వైపున ఉన్న ప్రాంతంలో ఒక గాయం కనిపించింది. అదేంటి అని ఆరా తీయగా అసలు విషయం బయటికి వచ్చింది. కడుపు నొప్పి రావడానికి ఒక రోజు ముందు గొడవ జరిగిందని.. ఓ వ్యక్తి కత్తితో పొడిచినట్లు చెప్పాడు. దీంతో ఆ యువకుడికి ఎక్స్ రే తీయగా.. కడుపులో కత్తి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను క్యూరియస్‌ అనే జర్నల్‌ ప్రచురితం చేసింది.


ఎక్స్ రేలో కనిపించిన కత్తిని బయటికి తీసేందుకు డాక్టర్లు ఆ యువకుడికి ఆపరేషన్ చేశారు. అనంతరం 15 సెంటీ మీటర్ల పొడవైన కత్తిని విజయవంతంగా బయటికి తీశారు. అయితే ఆ కత్తి కడుపులో కొన్ని గంటల పాటు ఉన్నప్పటికీ యువకుడి శరీరంలోని అవయవాలకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ కత్తి కడుపులో ఒక వైపు నుంచి మరో వైపుకు కదిలినట్లు డాక్టర్లు గుర్తించారు. అయితే గొడవ జరిగిన సమయంలో ఆ యువకుడు మద్యం మత్తులో ఉన్నట్లు వైద్యులకు చెప్పాడు. అసలు ఏం జరుగుతుందో తెలియలేదని.. కత్తితో పొడిచిన విషయం మాత్రం గుర్తుందని తెలిపాడు. ఆ తర్వాత స్థానికంగా ఉండే ఓ క్లీనిక్‌లో కత్తి గాటుకు కుట్లు వేయించుకున్నట్లు వివరించాడు. అయితే కట్టి లోపల ఉండిపోయింది అన్న నుమానం కూడా రాలేదని, కానీ ఆ ఘటన తర్వాత తీవ్రమైన కడుపు నొప్పి వచ్చినట్లు తెలిపాడు. కత్తి గుచ్చడంతోనే కావచ్చని భావించి.. తగ్గిపోతుందని అనుకున్నా తగ్గకపోవడంతో డాక్టర్లను ఆశ్రయించినట్లు వెల్లడించాడు.

Tags

Read MoreRead Less
Next Story