కార్టూనిస్ట్‌పై ఖుష్బూ కస్సు బుస్సు!

కార్టూనిస్ట్‌పై ఖుష్బూ కస్సు బుస్సు!
ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ ఓ తమిళ కార్టూనిస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె కారు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ఎటువంటి..

ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ ఓ తమిళ కార్టూనిస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె కారు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ఎటువంటి గాయాలు కాకుండా ప్రమాదం నుంచి ఖుష్బూ బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదం నిజంగా జరగలేదని, కల్పితమని సదరు కార్టూనిస్ట్‌ ఖుష్బూను తప్పుపడుతూ తమిళంలో ట్వీట్‌ చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత తీసిన ఫొటో షేర్‌ చేస్తూ.. ఈ ప్రమాదంలో ఎన్నో లొసుగులున్నాయని పేర్కొన్నాడు. కొన్ని ఫొటోల్లో ఖుష్బూ ముందు సీటులో కూర్చొని ఉంటే.. మరికొన్నింటిలో వెనుక కనిపించారన్నారు. ఆయన ట్వీట్‌ చూసిన ఖుష్బూ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడాలన్నారు.

కర్నూనిస్ట్‌పై తీవ్రంగా మండిపడ్డ ఖుష్బూ.. నీకు ధైర్యం ఉంటే ఫేక్‌ రోడ్డు ప్రమాదాన్ని సృష్టించేందుకు ప్రయత్నించాలని సూచించారు. చావు నీ ముఖంలో కనిపించిన ఆ క్షణం నువ్వు భయంతో వణికిపోతావని... ఎందుకంటే నాకున్న ధైర్యం నీకు లేదంటూ మండిపడ్డారు. నువ్వు పిరికి వ్యాఖ్యలు చేస్తున్నావు.. త్వరలో కోలుకోవాలని కోరుకుంటున్నా అంటూ ఖుష్బూ ఆయనకు కౌంటర్‌ ఇచ్చారు.

మరోవైపు తనకు జరిగిన రోడ్డు ప్రమాదంపై ఖుష్బూ అనుమానం వ్యక్తం చేశారు. తాను బ్యాక్‌ ఇన్‌ యాక్షన్‌లోకి రావడం చూసి కొందరు ఆశ్చర్యానికి గురయ్యారని.. కోట్లాది ప్రజల ప్రార్థనలు, ప్రేమ తనపై ఉన్నాయి కాబట్టి.. బతికానన్నారు. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు తన పక్కన నాపక్క ఉన్నారని.. దేవుడి ఆశీర్వాదాలు తనకున్నాయన్నారు. బెటర్‌ లక్‌ నెక్ట్స్‌ టైమ్‌.. అని పరోక్షంగా తన ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు.

Tags

Read MoreRead Less
Next Story