opposition INDIA: రాష్ట్రపతి దృష్టికి మణిపుర్‌ ఘటన

opposition INDIA: రాష్ట్రపతి దృష్టికి మణిపుర్‌ ఘటన
విపక్ష ఇండియా ఫ్రంట్‌ నేతల నిర్ణయం... మోదీ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచాలని తీర్మానించిన ప్రతిపక్షాలు..

మణిపూర్( Manipur) ఘటనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(president murmu) దృష్టికి తీసుకెళ్లాలని ప్రతిపక్షాలు(opposition) నిర్ణయించాయి. ప్రతిపక్ష కూటమి ఇండియా(opposition INDIA)కు చెందిన 21 పార్టీల సభాపక్ష నాయకులు వెళ్లి రాష్ట్రపతి(president)తో సమావేశం కావాలని నిర్ణయించారు. విపక్ష ఎంపీల బృందానికి రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే( Congress chief Mallikarjun Kharge) నాయకత్వం వహిస్తారు. ఈ మేరకు రాష్ట్రపతిని అపాయిట్‌మెంట్‌ కోరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో మణిపూర్ అంశంలో ప్రభుత్వం చేస్తున్న విమర్శలపై విపక్షాలు ఎదురుదాడికి దిగాయి. 68 మంది ఎంపీలు పార్లమెంటులో నోటీసులు ఇచ్చినా కూడా చర్చించకుండా ప్రభుత్వం పారిపోయిందని విమర్శించాయి.


మరోవైపు మణిపుర్‌లో రెండు రోజులపాటు పర్యటించిన ప్రతిపక్ష ఇండియా ఫ్రంట్‌ నేతలు(opposition INDIA grouping ) ఆ వివరాలను మిగిలిన నేతలకు వివరించారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో సమావేశమైన ఇండియా ఫ్రంట్‌ నేతలు మణిపుర్‌ వాస్తవ పరిస్థితులను మిగిలిన ఎంపీలకు వివరించారు. సోనియాగాంధీ(Sonia Gandhi), కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, వివిధ పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. మణిపుర్ పూర్తిగా స్మశానంగా మారిపోయిందని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి( Adhir Ranjan Chowdhury) వెల్లడించారు. అక్కడికి వెళ్లి పరిస్థితిని స్వయంగా చూస్తుంటే గుండె చలిస్తోందన్నారు. గతంలో చూసిన దానికంటే పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయని నేతలు వివరించారు. రెండు వర్గాల మనోభావాలను దెబ్బతీయకుండా రాజకీయ పార్టీలు నడుచుకోవాలని నేతలు సూచించారు.


పార్లమెంట్‌లో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తేవాలని కూడా విపక్ష నేతలు ఈ భేటీలో నిర్ణయించారు. మణిపుర్ ఘటనపై చర్చకు విపక్షాలు పట్టుబట్టగా ఎలాంటి కార్యకలాపాలు సాగకుండానే కొన్నిరోజులుగా ఉభయసభలు వాయిదా పడుతున్నాయి. మణిపూర్ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని విపక్ష ఎంపీలు సభలో ఆందోళనలకు దిగుతున్నారు. నిబంధన 267 కింద వెంటనే మణిపూర్ అంశంపై చర్చ జరగాలని విపక్ష సభ్యులు పట్టుబడుతున్నారు.

మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను సుప్రీంకోర్టు( Supreme Court) కూడా తీవ్రంగా పరిగణించింది. ఈ అంశంలో మణిపుర్‌ పోలీసులు(manipur police) నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించిన ధర్మాసనం, FIR దాఖలు చేసేందుకు 14 రోజుల సమయం ఎందుకు పట్టిందని, అన్ని రోజులు ఏం చేశారని నిలదీసింది. మహిళలను అల్లరిమూకలకు అప్పగించిన మణిపుర్ పోలీసులు ఈ కేసులో దర్యాప్తు చేయడాన్ని అంగీకరించబోమని స్పష్టం చేసింది. మణిపుర్‌లో పరిస్థితిని పర్యవేక్షించడానికి సిట్ లేదా మాజీ న్యాయమూర్తులతో కూడిన కమిటీని ఏర్పాటుచేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story