Maggi Noddles : కాస్ట్ లీ మ్యాగీ.. లాస్ట్ వరకు తినాల్సిందే. ఎందుకంటే

Maggi Noddles : కాస్ట్ లీ మ్యాగీ.. లాస్ట్ వరకు తినాల్సిందే. ఎందుకంటే
బిల్లును సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్

ఇలా ఆకలేస్తే అలా తయారయ్యే డిష్ మ్యాగీ.రాత్రి అయినా పగలైనా, ఇల్లైనా, ఆఫీసైనా కడుపులో కాస్తంత ఆకలిగా అనిపిస్తే వెంటనే వండుకుని తినగలిగే ఒకే ఒక వంటకం మ్యాగీ. రెండు నిమిషాల్లో సిద్ధమైపోయే ఈ ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను ఇష్టపడని వారు చాలా అరుదు. రుచిగా ఉండటమే కాకుండా ధర కూడా తక్కువగా ఉండటం దీనికున్న మరో ప్రత్యేకత. అందుకే అటు పిల్లలు, ఇటు పెద్దవాళ్ళు ఎవరైనా మ్యాగీని ఈజీ గా కొనేయగలరు, తినేయగలరు. అయితే అదే మ్యాగీ ఎయిర్‌పోర్టులో అయితే ఎంత ఉంటుంది? వద్దు లెండి.. మీరు గెస్ చేయద్దు.. ఎందుకంటే మీ గెస్సింగ్ మిమ్మల్ని ఇంకా బాధ పెడుతుంది..పాపం బాగా ఆకలిగా ఉండడంతో ఓ విమానాశ్రయంలో మసాలా నూడుల్స్ కొనుగోలు చేసిన ఓ యూట్యూబర్‌కి కళ్లు బైర్లు కమ్మాయి. కారణం దాని ఖరీదు రూ. 193 మాత్రమే.


సేజల్ సూద్ అనే యూట్యూబర్ ఇటీవల ఎయిర్పోర్ట్ లో మ్యాగీ నూడిల్స్ ను ఆర్డర్ చేశారు. దానికి అక్కడ సిబ్బంది ప్లేట్ ధర రూ. 184, జీఎస్టీ కింద రూ. 9 కలిపి మొత్తం రూ. 193 వసూలు చేశారు. షాక్ అయిన ఆమె బిల్లు పే చేసి తరువాత ఆ విషయాన్ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. విషయంపై ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదన్నారు. దీనిపై స్పందించిన నైటిజన్లు దీనిని విమాన ఇంధనంతో తయారు చేసారా అంటూ జోక్ చేశారు. అసలు అంత కాస్టలీ ఫుడ్ తినడం అవసరమా అని ఒకరు, బహుశా మీరు ఎయిర్పోర్టులో కొనుగోలు చేసిన అతి తక్కువ ధర ఉన్న వస్తువు ఇదే అయ్యి ఉండొచ్చు అంటూ మరో నెటిజన్ ట్విట్ చేశాడు. ఇలా ఒక్కొక్కరు తాము కొనుగోలు చేసిన వస్తువుల ధరల జాబితాలతో రిప్లైలు ఇచ్చారు.

అంత ధర ఉన్నప్పుడు నువ్వెందుకు కొన్నావంటూ ఓ అడిగిన ప్రశ్నకు అప్పటికే రెండు గంటలుగా ఆకలిమీద ఉన్నానని, దీంతో ఏదో ఒకటి తినాలనిపించి మ్యాగీ తీసుకున్నట్టు సేజల్ బదులిచ్చారు. వెంటనే మరో వ్యక్తి ఇలా తినే కంటే ఇంటి నుంచి డబ్బా తెచ్చుకోవడం బెటర్ అని సలహా ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story