Top

దేశవ్యాప్తంగా మహాత్మగాంధీ 151వ జయంతి వేడుకలు

దేశవ్యాప్తంగా మహాత్మగాంధీ 151వ జయంతి వేడుకలు
X

దేశవ్యాప్తంగా మహాత్మగాంధీ 151వ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. జాతిపిత సేవలు, ఆశయాలను ప్రముఖులు, ప్రజలు అంతా స్మరించుకుంటున్నారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ దగ్గర గాంధీకి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌తో పాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.. గాంధీ మహాత్మునికి శ్రద్ధాంజలి ఘటించారు.. ఆయన స్మృతులను నెమరవేసుకున్నారు. ఇక ప్రముఖులంతా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు క్యూ కడుతున్నారు. మహాత్ముడి సేవలను గుర్తు చేసుకుంటూ ఆయనకు నివాళులర్పిస్తున్నారు. సత్యం, అహింసలే ఆయుధాలుగా దేశ స్వాతంత్య్ర సంగ్రామ సారథిగా ప్రజలను చైతన్యం చేసిన గాంధీ ఆశయాలను అంతా గుర్తు చేసుకుంటున్నారు.

Next Story

RELATED STORIES