Election Flags: నేతన్నకు ముందే వచ్చిన ఓట్ల పండగ..

Election Flags: నేతన్నకు ముందే వచ్చిన ఓట్ల పండగ..
ఏ రాష్ట్రంలో అయినా సరే ఎన్నికలు అంటే జెండా సిరిసిల్లదే

రాజకీయ పార్టీ బలాన్ని ప్రదర్శించడంలో జెండాలు కీలకం. అందుకే ఎన్నికలొచ్చాయంటే జెండాలతయారీకి గిరాకీ మొదలవుతుంది. ఇప్పుడు ఏకంగా ఐదురాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటంతో సరిహద్దులు దాటి ఆయా పార్టీలు జెండాల తయారీ కోసం సిరిసిల్లకు తరలివస్తున్నాయి. మహిళలతో పాటు పలువురికి ఉపాధి లభిస్తుంది.

ఇప్పుడు తెలంగాణ లో ఎన్నికల వాతావరణం మొదలైయింది. అధికారం కోసం పార్టీ లు పోటీ పడుతున్నాయి గెలుపు లో ప్రచారమే కీలక పాత్ర పోషిస్తుంది. పార్టీ జెండాల తో ప్రచారం మరింత కలర్ ఫుల్ గా కనబడుతుంది. ఇప్పుడు సిరిసిల్ల లో రాజకీయ పార్టీ ల జెండాలు, బ్యానర్స్, టీ. షర్ట్స్. ఇతర ఎన్నికల సామాగ్రి తయారువుతుంది. తక్కువ ధరకు తయారు చేస్తు సరఫరా చేస్తున్నారు. ఎన్నికల వేళ కూడా రాష్ట్రము లోని వివిధ పార్టీల నాయకులందరి చూపు మళ్లీ సిరిసిల్లపైనే పడుతుంది. నిన్న మొన్నటి వరకు జాతీయ జెండాలు సిరిసిల్లలో తయారు చేసి సరఫరా చేసి జాతీయ స్థాయిలో మంచి పేరు సంపాదించుకున్న నేతన్నలు ఇప్పుడు కూడా రానున్న ఎన్నికల్లో సిరిసిల్ల కు చెందిన జెండాలే వాడుకుంటున్నారు.


ఇక్కడ చవకధరలకే లభిస్తుండడంతో పార్టీల నుంచి ఆర్డర్లు ఊపందుకున్నాయి. సిరిసిల్లలో 15 మంది వరకు తయారీదారులు ఉన్నారు. ఒక్కొక్కరి వద్ద 100 నుంచి 200 మంది కార్మికులు పనిచేస్తుండగా పరోక్షంగా వేలమందికి ఉపాధి లభిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో షెడ్యూల్ రాకపోయినా ముందస్తుగా ఆర్డర్లు వస్తుండటంతో తయారీదారులు.... తీరిక లేకుండా గడుపుతున్నారు. రాష్ట్రంలో ఒక్కో ప్రధాన పార్టీ నుంచి దాదాపు15 లక్షల వరకు జెండాలు, కండువాలు రూపొందించేలా... ఆర్డర్లు వచ్చాయని తయారీదారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల నుంచి ఆర్డర్లు వచ్చాయంటున్న తయారీదారులు మరింత మంది ఆర్డర్లు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నా తయారుచేసేందుకు కావాల్సిన సిబ్బంది అందుబాటులో లేరని ఉత్పత్తిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమిళనాడు, కర్నాటక, కేరళ, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఇప్పటికే గత కొన్నేళ్లుగా ఈ ఎన్నికల ప్రచార సామాగ్రిని సరఫరా చేస్తున్నారు. డిజిటల్ మిషన్ ఆధారంగా పార్టీ జెండాలు తయారు చేస్తున్నారు. ఇప్పటికే brs, బీజేపీ, కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్స్ వచ్చాయి.అన్ని పార్టీల నాయకులు, వివిధ నియోజకవర్గాల ఎమ్మేల్యే అభ్యర్థులు గతంలో కూడా సిరిసిల్లలోనే తమ ఎన్నికల ప్రచార సామాగ్రిని తయారు చేయించుకున్నారు.

గతంలో దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల నుంచి సిరిసిల్ల వ్యాపారులకు కోటి జాతీయజెండాల తయారీకి ఆర్డర్లు వచ్చాయి. తాజాగా ఎన్నికల నగారా మోగడంతో మరో అవకాశం లభించిందని... వేలాది మందికి ఉపాధి కల్పించే అవకాశం వచ్చిందని పలువురు వ్యాపారులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story