CWC: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ కొత్త జట్టు

CWC: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ కొత్త జట్టు
కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ పునర్వ్యవస్థీకరణ.... 84 మందితో నూతన కమిటీ....

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే(Mallikarjun Kharge) పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ (Congress Working Committee)ని పునర్వ్యవస్థీకరించారు. స్టీరింగ్‌ కమిటీ స్థానంలో 84మందితో నూతన CWCని ఏర్పాటు చేశారు. ఇందులో 15 మంది మహిళలతోపాటు పార్టీ అధినాయకత్వంపై ప్రశ్నలు సంధించిన గ్రూప్‌-23 సభ్యుల్లో కొందరికి కూడా చోటు కల్పించారు. కొత్త CWCలో 39మంది సాధారణ సభ్యులు(39 members) కాగా కొంతమంది రాష్ట్రాల బాధ్యులు సహా 32మంది శాశ్వత ఆహ్వానితులు( 32 permanent invitees), యువజన కాంగ్రెస్‌ విభాగం(Youth Congress), NSUI, మహిళా కాంగ్రెస్‌(Mahila Congress), సేవాదళ్‌(Seva Dal) అధ్యక్షులు సహా 13మంది ప్రత్యేక ఆహ్వానితులు(13 special invitees) ఉన్నారు. సాధారణసభ్యులుగా మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, మన్మోహన్‌ సింగ్‌, రాహుల్‌ గాంధీ, అధీర్‌రంజన్‌ చౌదరీ, ఆంటోనీ, అంబికాసోనీ, మీరాకుమార్‌, దిగ్విజయ్‌ సింగ్‌, పి.చిదంబరం, ప్రియాంకాగాంధీ ఉన్నారు.


కాంగ్రెస్‌ అధినాయకత్వంపై ప్రశ్నలు సంధించిన శశిథరూర్‌( Shashi Tharoor), ఆనంద్‌శర్మ, ముకుల్‌ వాస్నిక్‌ కొత్త CWCలో సాధారణ సభ్యులుగా నియమితులయ్యారు. ఆ గ్రూప్‌నకే చెందిన మనీశ్‌ తివారీ, వీరప్పమొయిలీ శాశ్వత ఆహ్వానితులుగా ఉన్నారు. పంజాబ్‌ మాజీ సీఎం చరణ్‌జీత్‌ చన్నీ, ప్రతిభాసింగ్‌లు CWC సాధారణ సభ్యులుగా నియమితులయ్యారు. రాజస్థాన్‌లో గహ్లోత్‌ సర్కార్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన సచిన్‌ పైలెట్‌(Sachin Pilot)కు కూడా కొత్త CWCలో చోటుదక్కింది.


కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయ‌క విభాగం పార్టీ వ‌ర్కింగ్ క‌మిటీలో చోటు ద‌క్కడంపై రాజ‌స్ధాన్ కాంగ్రెస్ నేత స‌చిన్ పైల‌ట్ (Sachin Pilot) సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతాల‌ను అనుస‌రిస్తూ కాంగ్రెస్ బ‌లోపేతానికి శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తాన‌ని వెల్లడించారు. ప్రతిష్టాత్మక ప‌ద‌విని కేటాయించినందుకు సీనియ‌ర్ నేత‌ల‌కు ట్విట్టర్ వేదిక‌గా కృత‌జ్ఞత‌లు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, అగ్రనేత‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల‌కు ధ‌న్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ప్రజ‌ల‌కు మ‌రింత చేరువ చేసేందుకు కృషి చేస్తామ‌ని సచిన్‌ పైలట్‌ తెలిపారు. CWCలో స్ధానం క‌ల్పించినందుకు అగ్రనేత‌ల‌కు కాంగ్రెస్ ఎంపీ గౌర‌వ్ గ‌గోయ్ కృత‌జ్ఞత‌లు తెలిపారు. ప్రతిష్టాత్మక ప‌ద‌వి అందించి పార్టీకి, దేశానికి సేవ చేసే అవ‌కాశం క‌ల్పించార‌ని ఖ‌ర్గే, సోనియా, రాహుల్ గాంధీల‌ను గౌర‌వ్ గ‌గోయ్ కొనియాడారు. CWCలో చోటు ద‌క్కడం త‌నకు పార్టీ ఇచ్చిన గౌర‌వానికి సంకేత‌మ‌ని కాంగ్రెస్ నేత ప‌వ‌న్ ఖేరా పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story