ముందస్తుకు బీజేపీ ప్లాన్, హెలికాప్టర్లను కూడా బుక్‌ చేసుకుంది: మమత

ముందస్తుకు బీజేపీ ప్లాన్, హెలికాప్టర్లను కూడా బుక్‌ చేసుకుంది: మమత

లోక్‌సభ ఎన్నికలపై బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో జరగాల్సిన ఎన్నికలను ఈ ఏడాది డిసెంబరులోనే నిర్వహించే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ప్రచారం కోసం ఆ పార్టీ ఇప్పటికే హెలికాప్టర్లన్నింటినీ బుక్‌ చేసుకున్నారని అన్నారు. ఇతర పార్టీలకు హెలికాప్టర్లు దొరకకుండా చేసే ఎత్తుగడ వేసిందని అన్నారు.టీఎంసీ యువజన విభాగం నిర్వహించిన కార్యక్రమంలో మమత పాల్గొన్నారు.బెంగాల్‌లో 30 ఏళ్ల కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని తాము గద్దె దించామని, కేంద్రంలోనూ బీజేపీని అధికారంలో నుంచి దించుతామని అన్నారు.జాదవ్‌పూర్‌ వర్సిటీలో ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలు గోలీ మారో అని నినాదాలు చేయడాన్ని తీవ్రంగాపరిగణిస్తున్నట్లు చెప్పారు. వారిని అరెస్టు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు.

బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశంలో నిరంకుశ పాలనే రాజ్యమేలుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.బీజేపీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే, పరిస్థితులు దారుణంగా ఉంటాయని, మన దేశాన్ని విద్వేషపు దేశంగా మారుస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక బీజేపీ ఇప్పటికే అన్ని వర్గాల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తోందని, మరోసారి అధికారం చేపడితే పరిస్థితులు దారుణంగా ఉంటాయని దీదీ అన్నారు.మరోవైపు, గవర్నర్ సీవీ ఆనంద బోస్ తీరుపై మండిపడ్డ మమత.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వంతో సవాల్​కు దిగొద్దంటూ మండిపడ్డారు. రాజ్యాంగేతర యాక్టివిటీస్​కు తన సపోర్ట్ ఎప్పటికీ ఉండదని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story