Mumbai : బాంద్రా-వర్లీ సీ లింక్ నుంచి దూకి వ్యక్తి ఆత్మ హత్య

Mumbai : బాంద్రా-వర్లీ సీ లింక్ నుంచి  దూకి వ్యక్తి ఆత్మ హత్య
కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

ముంబైలోని బాంద్రా వర్లీ సీ లింక్ నుంచి ఓ వ్యక్తి అరేబియా సముద్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే అతనికి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాంద్రా వర్లీ సీ లింక్ మధ్యలో ఓ వ్యక్తి తన కారును ఆపి సముద్రంలోకి దూకాడు. విషయం తెలుసుకున్న వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ముంబై పోలీసులు, ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లను సెర్చ్ ఆపరేషన్ కోసం మోహరించారు. ఇప్పటికీ ఆ వ్యక్తి ఆచూకీ కోసం అన్వేషణ కొనసాగుతోందని కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు.

ఆత్మహత్యకు పాల్పడిన ఆ 55 ఏళ్ళ వ్యక్తి కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే మెదడుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ మెరుగు పడకపోవడంతో విసిగిపోయి తన జీవితాన్ని ముగించుకుంటానని తమతో పదే పదే చెప్పేవాడని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పినట్టుగా సమాచారం. ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సంఘటనతో ఆ ప్రాంతం లో ట్రాఫిక్‌ స్తంభించింది. ఇండియన్ నేవీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

బాంద్రా వర్లీ సీ లింక్ రోడ్డు 5 కి.మీ కంటే ఎక్కువ పొడవు మరియు 8 లేన్ల వెడల్పు గల కేబుల్ వంతెన. ఇది ముంబై యొక్క పశ్చిమ శివారులోని బాంద్రాను దక్షిణ ముంబైలో ఉన్న వర్లీతో కలుపుతుంది. జూలై 2019లో కూడా, ఓ 25 ఏళ్ల వ్యక్తి వర్లీలోని బాంద్రా వర్లీ సీ లింక్‌లో సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story