Manipur : మణిపూర్-మయన్మార్ సరిహద్దులో కంచె!

Manipur : మణిపూర్-మయన్మార్ సరిహద్దులో కంచె!
మణిపూర్‌-మయన్మార్ సరిహద్దు వెంబడి 70 కి.మీ. కంచె, బీరేన్ సింగ్ సంచలన నిర్ణయం

మణిపూర్‌లోని బీరేన్ సింగ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో నాలుగు నెలలుగా అక్కడి జాతుల మధ్య ఘర్షణలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందుకు పక్కనే ఉన్న మయన్మార్ నుంచి వచ్చే కొన్ని శక్తులు కూడా కారణమన్న అనుమానమున్న నేపథ్యంలో మణిపూర్‌-మయన్మార్ సరిహద్దు వెంబడి 70 కి.మీ. మేర కంచె నిర్మించేందుకు సిద్ధమవుతోంది. సరిహద్దు రోడ్డు సంస్థ అధికారులతోనూ, రాష్ట్ర పోలీసులు, హోంశాఖతో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ చర్చలు జరిపారు. అదనపు కంచె ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని అధికారులకు వివరించారు.

గత మూడు నెలలుగా మణిపూర్ లో అల్లర్లు భారతదేశ అంతర్గత భద్రతను ప్రశ్నిస్తున్నాయి. ఈ అల్లర్లకు పక్కనే ఉన్న మయన్మార్ నుంచి వచ్చే కొన్ని శక్తులు కూడా కారణమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా మణిపూర్ లోకి మయన్మార్ నుంచి కుకీ తెగకు చెందినవారు వచ్చి అక్కడి జనాభా స్వరూపాన్ని మార్చేస్తున్నారని మైయిటీలు ఆరోపిస్తున్నారు. కుకీలు, మైయిటీల మధ్య జరిగిన ఘర్షణల్లో వీరి పాత్ర కూడా ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు కూడా హెచ్చరించారు. ఈ రెండు తెగల మధ్య హింస కారణంగా 175 మంది చనిపోయారు. అనేక మంది వేరే ప్రాంతాలకు వలస వెళ్లారు. మెయిటీ ఎస్టీ హోదా అడగడంతో ఈ ఘర్షణలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు ఆ రాష్ట్రంలో పరిస్థితులు కాస్త సద్దుమణినట్లుగా కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్.. మయన్మార్ సరిహద్దులో భద్రతపై దృష్టి సారించారు. ఆ దేశం నుంచి వచ్చే చొరబాట్లను నివారించడానికి 70 కిలోమీటర్ల వరకు కంచెను నిర్మింటాలని ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం.



అయితే ఇందుకు సంబంధించిన విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ (ట్విట్టర్)లో వివరించారు. అలాగే శనివారం రోజున ఇంఫాల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఫ్రీ మూవ్‌మెంట్ రెజిమ్’ వల్ల భారత్‌-మయన్మార్‌ ప్రజలు ఇరువైపులా ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా 16 కిలోమీటర్ల మేర సంచరించే వీలుందని, దీనివల్లే అక్రమ వలసదారులు భద్రతా సిబ్బంది కంట పడకుండా సులువుగా తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. అలాగే ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ‘ఫ్రీ మూవ్‌మెంట్ రెజిమ్’ను రద్దు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఆదివారం బార్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌వో) అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఇందులో సీఎస్‌, డీజీపీ సహా పలువుకు హోంశాఖ అధికారులు సైతం ఆ సమావేశానికి హాజరయ్యారు. అయితే భారత్-మయన్మార్ సరిహద్దులో 70 కిలోమీటర్ల వరకు ఉన్న అదనపు కంచె ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని బీఆర్‌వోకు ముఖ్యమంత్రి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story