Manipur: యుఎన్ఎల్‌ఎఫ్‌తో కేంద్రం శాంతి ఒప్పందం

Manipur: యుఎన్ఎల్‌ఎఫ్‌తో కేంద్రం శాంతి ఒప్పందం
60 ఏళ్లకు ఆయుధాల్ని విడిచిపెడుతూ ప్రభుత్వంతో సంచలన ఒప్పందం చేసుకున్న మణిపూర్ మిలిటెంట్లు

మణిపూర్‌లోని చట్టవిరుద్ధమైన యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (UNLF) సుమారు 60 సంవత్సరాలకు తన హింసా పద్దతికి ముగింపు పలికింది. కేంద్ర, రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలతో జరిపిన సుదీర్ఘ చర్చల అనంతరం బుధవారం శాంతి ఒప్పందంపై సంతకం చేసింది. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారు. నిషేధిత సంస్థతో చర్చలు జరుపుతున్నామని, అవి తొందరలో ఆచరణలోకి వస్తాయని గతంలో మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తెలిపారు. అతి త్వరలో ఓ పెద్ద అండర్‌గ్రౌండ్‌ సంస్థతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

యూఎన్ఎల్‌ఎఫ్‌, కేంద్రం మధ్య శాంతి ఒప్పందం కుదరడానికి చారిత్రక మైలురాయిగా అమిత్‌షా అభివర్ణించారు.''చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈశాన్యంలో శాశ్వత శాంతి నెలకొనేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత కృషిలో భాగంగా యూనైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఈరోజు ఢిల్లీలో శాంతి ఒప్పందంపై సంతకాలు చేసింది. లోయలో పూరాతన సాయుధ సంస్థ అయిన యూఎన్ఎల్ఎఫ్ హింసను విడనాడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు అంగీకరించింది. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియను నేను స్వాగతిస్తున్నాను. శాంతి, ప్రగతి దిశగా సాగే ఈ ప్రయాణంలో వారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తు్నాను'' అని అమిత్‌షా ట్వీట్ చేశారు.


యూఎన్ఎల్ఎఫ్, భారత ప్రభుత్వం, మణిపూర్ ప్రభుత్వం మధ్య కుదిరిన శాంతి ఒప్పందంతో మణిపూర్‌లో ఆరు దశాబ్దాల సాయుధ ఉద్యమానికి తెరపడినట్టు అమిత్‌షా తెలిపారు. సమ్మిళిత అభివృద్ధి, ఈశాన్యభారత యువతకు ఉజ్వల భవిష్యత్తు కల్పించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ కలను సాకరం చేసే దిశగా ఈ ఒప్పందం చారిత్రక మైలురాయిగా నిలుస్తుందన్నారు.

ఈ ఏడాది మొదట్లో మైతీ కమ్యూనిటీకి షెడ్యూల్డ్ తెగ (ST) హోదా ఇవ్వకూడదంటూ కొండ జిల్లాలలో ‘ఆదివాసి సంఘీభావ యాత్ర’ నిర్వహించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింసలో 180 మందికి పైగా మరణించారు. రాష్ట్ర జనాభాలో మైతీలు 53 శాతం ఉన్నారు. వారిలో ఎక్కువ మంది ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. నాగాలు, కుకీలతో సహా ఇతర గిరిజనులు జనాభాలో 40 శాతం ఉన్నారు. వీరు ముఖ్యంగా రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story